యూకేలో కౌంటీ క్రికెట్  లో భాగంగా ఆడుతున్న యువ క్రికెటర్ ఖుమాలో పై ఇటీవల బ్రిడ్జి వాటర్ దగ్గర గుర్తుతెలియని దుండగులు దాడిచేసిన ఘటన సంచలనం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాల బారిన పడిన క్రికెటర్ ఖుమాలో కోమాలోకి వెళ్ళిపోవడం మరింత సంచలనంగా  మారిపోయింది. దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతనికి మెరుగైన చికిత్స అందించింది అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు యువ ఆటగాడు ఖుమాలో కోమా నుంచి బయటపడ్డాడు అన్న విషయం తెలుస్తుంది. ఈ విషయాన్ని సహచర ఆటగాడు లాయిడ్ ఐరిష్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.


 ప్రస్తుతం యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చిన మొండ్లి ఖుమాలో నార్త్ పెర్తర్ టన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే  మ్యాచ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున ఖుమాలో పై కొంతమంది దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు.. ఈ దాడిలో యువ క్రికెటర్ తలకు తీవ్రమైన గాయం కావడం గమనార్హం. దీంతో అతడి మెదడులో రక్తం గడ్డకట్టడం తో వైద్యులు ఎంతో కష్టపడి మూడు సర్జరీలు చేసి ఇక అతని ప్రాణాపాయం నుంచి తప్పించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోమాలోకి వెళ్లిపోయాడు ఖుమాలో.

 ఇక ఇప్పుడు అతను కోమాలో నుంచి కోలుకున్నాడు అనేది తెలుస్తుంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది అంటూ సహచర ఆటగాడు ఐరిష్ చెప్పుకొచ్చాడు. అతను కోమా నుంచి కోలుకున్న తరువాత అతని తల్లి కోసం అడుగుతున్నాడని తెలిపాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ను కూడా చూస్తున్నాడని వెల్లడించాడు. అంతే కాకుండా అతను తదుపరి మ్యాచ్ ఎప్పుడు ఆడబోతున్నాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాడని సహచర ఆటగాడు ఐరిష్ చెప్పుకొచ్చాడు. ఈ యువ క్రికెటర్ కోమాలో నుంచి బయటకు రావడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: