ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో ఎంతలా అతలాకుతలం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రతి ఒక్కరూ అడిగి మరీ వ్యాక్సిన్ వేయించుకుని ఇక వైరస్ బారి నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో  క్రీడాకారులు కూడా వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య అటు టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ మాత్రం వ్యాక్సిన్ వేసుకోను తేల్చి చెప్పడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.


 వ్యాక్సిన్ వేసుకోకపోవడం కారణంగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఆడలేకపోయాడు ఈ దిగ్గజ ఆటగాడు. ఇక త్వరలో జరగబోయే యూఎస్ ఓపెన్ లోనూ అలాంటి పరిస్థితి ఎదురైతే పట్టించుకోను అంటూ కామెంట్ చేశాడు. ఈ ఏడాది గ్రాండ్ స్లామ్  ఈవెంట్లలో ఈ సెర్బియా ఆటగాడికి రేపటి నుంచి ప్రారంభమయ్యే వింబుల్డన్ టోర్నీ చివరిది కావడం గమనార్హం. ఒకవేళ ఇక ఈ వింబుల్డన్ టోర్నీ మిస్ అయ్యాడు అంటే అతడు తిరిగి గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో పాల్గొనాలంటే ఇక వచ్చే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాను వ్యాక్సిన్ వేసుకోను అంటూ తేల్చి చెప్పాడు జకోవిచ్.


 నేను వాక్సినేషన్ వేయించుకోని కారణంగా నిబంధనల ప్రకారం అమెరికాలో అడుగుపెట్టడానికి వీలులేదు. ఈ విషయంపై నాకు స్పష్టత ఉంది. అయితే నాకు వింబుల్డన్ టోర్నీలో మరింత విశేషంగా రాణించడానికి  ఇది స్పూర్తిగా అనిపిస్తుంది. వింబుల్డన్లో కచ్చితంగా విజయం సాధిస్తాను అన్న  నమ్మకం కూడా ఉంది.. అయితే నేను అమెరికాలో కి రావాలా వద్దా అన్నది అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వ్యాక్సినేషన్ మీకు ఇష్టం లేదా అని అడుగగా కచ్చితంగా ఇష్టం లేదు అంటూ తెలిపాడు. వ్యాక్సిన్ కు తాను వ్యతిరేకం కాదని.. కానీ తన శరీరం లోకి ఏది తీసుకోవాలో తీసుకోద్దో నిర్ణయించుకునే హక్కు నాకు ఉందని చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: