ప్రస్తుతం భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ప్రతి మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఏదో ఒక రికార్డును కొల్లగొడుతూ ఉంటాడు. ఇక ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డు కు కాస్త దూరం లోనే ఉన్నాడు అన్నది తెలుస్తుంది. మరో 40 పరుగులు చేశాడు అంటే చాలు విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక అరుదైన రికార్డు వచ్చి చేరుతూ ఉంటుంది. ఇంగ్లాండుపై టెస్టు ఫార్మాట్లో 200 రన్స్ పూర్తిచేసుకున్న మైలురాయి ఆదుకుంటాడు. కాగా ఇప్పటివరకు కేవలం ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఇంగ్లాండ్ పై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నారు.  27 టెస్ట్ లలో 48 ఇన్నింగ్స్ లో ఆడిన విరాట్ కోహ్లీ 5 సెంచరీలు 9 హాఫ్ సెంచరీలతో 1960 పరుగులు చేశాడు.



 ఇందులో 2018 లోనే  మూడు సెంచరీలు సాధించడం గమనార్హం. ఇక టెస్టుల్లో ఇంగ్లాండ్ పై కోహ్లీ వ్యక్తిగత స్కోరు 235 గా ఉంది. ఇక సచిన్ టెండూల్కర్ 36 ఇన్నింగ్స్ లలో అటు ఇంగ్లాండ్ పై రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సునీల్ గవాస్కర్ 47 ఇన్నింగ్సులో ఇలా రెండు వేల పరుగులు  పూర్తి చేసుకున్న ఘనత సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ 40 పరుగులు చేశాడు అంటే ఇద్దరు దిగ్గజ క్రికెటర్ ల సరసన చేరుతాడు అని చెప్పాలి.


 ఇకపోతే గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టి తన పేరును లిఖించుకున్న విరాట్ కోహ్లీ గత మూడేళ్ళ నుంచి మాత్రం సెంచరీ చేయలేకపోయాడు. కనీసం పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పెడుతున్నాడు. కాగా నేటి నుంచి అటు ఇంగ్లాండ్ భారత్ మధ్య కీలకమైన టెస్టు మ్యాచ్ జరుగుతుంది. కాగా ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: