ఇటీవల కాలంలో టీమిండియాలో జరుగుతున్న మార్పులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. టీమిండియా ఆడుతున్న మ్యాచ్ లలో ఎవరు జట్టులోకి వస్తారు ఎవరూ విశ్రాంతి తీసుకుంటారు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారు అన్నది కూడా పూర్తిగా కన్ఫ్యూజన్ గానే ఉంది  మ్యాచ్ మొదలు అయ్యేంత వరకు కూడా ఈ విషయం బయట ప్రేక్షకులకు క్లారిటీ లేకుండా పోతుంది అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మకి వెస్టిండీస్ పర్యటనలో విశ్రాంతి ఇవ్వడం కె.ఎల్.రాహుల్ గాయం కారణంగా దూరమవ్వడం తో ఇక శుభ మన్ గిల్ కి అవకాశం దక్కింది. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్లో అవకాశం తగ్గించుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.


 తొలి వన్డే మ్యాచ్లో 53 బంతుల్లో 64 పరుగులు.. ఇక రెండో వన్డే మ్యాచ్లో 49 బంతుల్లో 43 పరుగులు చేసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆరంభం చేసిన శుభ మన్ గిల్ వాటిని భారీ స్కోర్లు గా మార్చడంలో మాత్రం విఫలమయ్యాడు. కాగా ఇటీవలే శుభ మన్ గిల్ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ పర్యటనలో శుభ మన్ గిల్ ఎంతో బాగా ఆడాడు. అతనిలో టాలెంటు ఉంది. అయితే దాన్ని సరిగా వాడుకోవడమే అతనికి ఇంకా తెలియడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.


 మంచి ఆరంభం దొరికిన సమయంలో శుభ మన్ గిల్ తప్పకుండా సెంచరీ చేస్తాడు అని భావించాను. క్రీజులో అతడు బాగా సెట్ అయ్యాడు అని అనుకుంటున్న సమయంలో చివరికి వికెట్ కోల్పోయి నిరాశపరిచాడు. అయితే మంచి స్టార్ట్ చేయడమే కాదు వాటిని భారీ స్కోర్లు గా మలచడం కూడా తెలియాలి. అయితే దానికి కాస్త సమయం పడుతుంది. అనుభవం అన్ని పాఠాలు నేర్పిస్తుంది అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: