ఒకప్పుడు పరుగుల వరద పారించి  ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం సాదాసీదా ఇన్నింగ్స్ ఆడటానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి ప్రతీ విషయం కూడా విరాట్ కోహ్లీ గురించి చర్చనీయాంశంగానే మారిపోతుంది. ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అతను వరుస వైఫల్యాలు గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాలు వ్యవధిలో వైరల్ గా మారి పోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


 ముఖ్యంగా మానసిక సమస్యల పై ఒత్తిడి పై గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ వరుస పోస్టులు పెడుతున్నాడు. అయితే ఒక అథ్లెట్గా మానసిక సమస్యలను భరించడం ఎంతో కష్టమని అది మనలో ఒత్తిడిని పెంచుతుందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే అలాంటి అనుభవం తనకు కూడా ఎదురైంది అంటూ చెబుతున్నాడు విరాట్ కోహ్లీ. ఒకానొక దశలో చుట్టూ అందరూ ప్రేమించే వాళ్ళు ఉన్నప్పటికీ తాను మాత్రం ఎవరూ లేని ఒంటరి వాడిగా ఫీలయ్యాను అంటూ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ లో ఆడబోతున్న విరాట్ కోహ్లీ ఇటీవల ఇండియా ఎక్స్ ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.


 సాధారణంగా ఒక అథ్లెట్ ఉత్తమమైన వాటిని తీసుకురావాలి. అదే సమయంలో ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.  దీని దరిచేరనీయకుండా ఉండాలంటే కసరత్తులు చేయాలి.  ఫిట్నెస్తో ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు చేయాల్సిన దానిపై ఏకాగ్రత పెరుగుతుంది. నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది.  ఒకానొక సమయంలో నేను వెళ్ళిన గదిలో  నా చుట్టూ ఉన్న వాళ్లంతా నన్ను ప్రేమించే వాళ్ళే అయినప్పటికీ నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఎవరితో సరిగా కలవలేక పోయాను.. కానీ నాకు నేను సర్ది చెప్పుకుని అందరితో కలిసి పోయాను. మూడ్  సరిగా లేనప్పుడు అందరితో రిలేషన్షిప్ కొనసాగించాలి. ఒత్తిడి దూరం చేసుకోవడానికి ఇదే మంచి మార్గం అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: