టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్  టీమ్ ఇండియా జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా ఆసియాకప్ ఆడుతూ ఉండగా అటు శుభమన్ గిల్ మాత్రం ఆసియా కప్లో టీమ్ ఇండియా జట్టు ఎంపిక కాలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కౌంటిలో ఆడుతూ బిజీబిజీగా ఉన్నాడు ఈ యువ ఆటగాడు. అయితే ఇటీవలే తన పుట్టినరోజు నాడు డెబ్యూ కౌంటీ మ్యాచ్లో అదరగొట్టాడు శుభమన్ గిల్.   డివిజన్ 1 లో  గ్రామోర్గాన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న శుభమన్ గిల్ వొర్సస్టర్ షైర్  జట్టుపై 92 పరుగులు సాధించాడు.


 కేవలం 8 పరుగుల దూరంలో సెంచరీకి చేరువ కాలేకపోయాడు శుభమన్ గిల్. వికెట్ చేజార్చుకునీ సెంచరీ అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. చాలాకాలంగా శుభమన్ గిల్ 90 పరుగులు ఎంతో సునాయాసంగా చేస్తూ ఉన్నప్పటికీ 90పరుగుల వద్ద తీవ్ర ఒత్తిడి కారణంగా వికెట్ కోల్పోతున్నాడు. దీంతో అతనికి నైంటీస్ ఫోబియా ఉంది అంటూ ఎంతోమంది కామెంట్ చేయడం కూడా చూశాము. ఈమధ్య జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా తొలిసారి 90 పరుగులు చేసిన శుభమన్ గిల్  సెంచరీ మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు.


 కాగా ఇటీవలే కౌంటీ క్రికెట్ లో భాగంగా 148 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 92 పరుగులు చేశాడు శుభమన్ గిల్. ఇక వికెట్-కీపర్ కుక్ 51 నాటౌట్ గా నిలిచాడు. ఎడ్ వార్డ్ బైరోమ్ 67 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు మినహా మిగతా అందరు విఫలమయ్యారు అని చెప్పాలి. దీంతో గ్లామోర్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులకు ఆలౌట్ అయింది. ఏది ఏమైనా మరోసారి శుభమన్ గిల్ 90 పరుగుల వద్ద వికెట్లు కోల్పోవడం.. అది కూడా పుట్టినరోజు నాడే ఇలా జరగడం తెలిసిన అభిమానులు కాస్త నిరాశ లో మునిగిపోయారు అని చెప్పాలి. సెప్టెంబర్ 8, 1999లో శుభమన్ గిల్ జన్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: