భారత క్రికెట్ నియంత్రణ మండలి లో ఇటీవల అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు బిసిసిఐ అధ్యక్ష పదవిలో కొనసాగిన సౌరబ్ గంగూలీకి రెండవసారి బిసిసిఐ పీఠంపై కూర్చునే అవకాశం మాత్రం దక్కలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు ఏకగ్రీవంగా టీమిండియా మాజీ ఆటగాడు రోజర్ బిన్నీని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక బిసిసిఐ నూతన చైర్మన్గా ఎంపికైన రోజర్ బిన్నీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. భారత క్రికెట్ లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టడంపై ఇటీవల స్పందించిన రోజర్ బిన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సవాళ్లను ఎదురుకోవడం నాకు ఎంతో ఇష్టం అంటూ తెలిపాడు. భారత క్రికెట్లో టాప్ పొజిషన్ బాధ్యతలు తీసుకోవడానికి తానేమి కంగారు పడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ బిసిసిఐ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయాలని కబురు వచ్చినప్పుడు మాత్రం కాస్త కంగారు పడ్డాను అంటూ వెల్లడించాడు. అయితే ఇలా కబురు పంపినప్పుడు బీసీసీఐలో ఏదో ఒక పోస్ట్ కోసం నన్ను అడుగుతున్నారేమో అని అనుకున్నాను.


 కానీ ఏకంగా బీసీసీఐ అధ్యక్ష పదవి కోసమే తనకు కబురు పంపారు అన్న విషయాన్ని మాత్రం ఊహించలేదు. ఇక నేను బీసీసీ ప్రెసిడెంట్ అయినట్లు అనుకోవడానికి ఓ రోజు రాత్రంతా పట్టింది అని చెప్పాలి. ఇక నాకు సవాలు అంటే ఎంతో ఇష్టం తప్పకుండా ఆనందంగానే బాధ్యతలు నిర్వర్తిస్తానని భావిస్తున్న అంటూ రోజర్ బిన్ని చెప్పుకొచ్చాడు.  ఈ మాజీ ఆటగాడు అటు టీమ్ ఇండియాకు మొదటి వరల్డ్ కప్ అందించిన జట్టులో ప్లేయర్ గా ఉన్నాడు అని చెప్పాలి. ఇక తన కెరీర్లో 27 టెస్టులు 72 వన్డే మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: