ఇటీవల గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్  టీమ్ ఇండియాకు దూరం కావడంతో ఇక జట్టులో ఓపెనర్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టీమ్ ఇండియా జట్టు బంగ్లాదేశ్ పర్యటనలొ ఉంది.  ఈ క్రమంలోనే అక్కడ వన్డే సిరీస్ ఆడుతుంది. అయితే ఇటీవలే మొదటి వన్డే సిరీస్ లో భాగంగా భారత జట్టు ఓటమిపాలు అయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే మొదటి వన్డే మ్యాచ్లో అటు భారత జట్టు ఫీలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్ గా వ్యవహరించిన రాహుల్ ఎంతో సులభమైన క్యాచ్ ను వదిలివేయడంపై తీవ్ర స్థాయిలొ విమర్శలు వచ్చాయి. రాహుల్ కీలకమైన క్యాచ్ వదిలి వేయడం కారణంగానే టీమిండియా ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ భారత అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మొదటి వన్డే మ్యాచ్లో సింపుల్ క్యాచ్ వదిలేసి విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్.  రెండో వన్డే మ్యాచ్లో మాత్రం కళ్ళు చెదరే క్యాచ్ తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు.


 బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో 47 ఓవర్ వేశాడు స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్. ఈ క్రమంలోనే అతని బౌలింగ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ మహమ్మదుల్లా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ దిశగా దూసుకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఎంతో అలర్ట్ గా ఉన్న కేఎల్ రాహుల్ కుడి చేతి వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో  అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు అని చెప్పాలి. ఇలా కేఎల్ రాహుల్ పట్టిన అద్భుతమైన క్యాష్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా మారింది. అయితే ఇక 77 పరుగులతో మంచి ఫామ్ లో ఉన్న మహమ్మదుల్లా చివరికి నిరాశతో పెవిలియన్  చేరాడు అని చెప్పాలి. కేఎల్ రాహుల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: