మినీ వేలం కారణంగా ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్లబోతున్నాడు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో ఆడని ఎంతో మంది భారత యువ ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లు సైతం ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వేలంలో పాల్గొనే పోయే వారిని షార్ట్ లిస్ట్ చేశాయి అన్నది తెలుస్తుంది. మొత్తంగా మినీ వేలంలో పాల్గొనేందుకు 991 మంది ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇక ఈ మొత్తం ప్లేయర్ల జాబితాను షార్ట్ లిస్టు చేయగా ఇక 405 మంది ప్లేయర్లు మెగా వేలంలోకి రాబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ఇలా మెగా వేలంలోకి వస్తున్న 405 మంది ప్లేయర్లలో 273 మంది ఇండియన్ ప్లేయర్లు ఉండగా.. 132 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు అన్నది తెలుస్తుంది. 10 ఫ్రాంచైజీలకు మొత్తం 87 మంది ప్లేయర్లను తీసుకునే అవసరం ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక వీరిలో 30 మంది వరకు విదేశీ ప్లేయర్లను కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఇక ఆయా ఫ్రాంచైజీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి