భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న విషయం తెలిసిందే. తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ ను తన వైపుకు తిప్పుకోగల సమర్థుడు మహేంద్రసింగ్ ధోని అని చెబుతూ ఉంటారు. అంతేకాదు క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఒత్తిడికి గురి కాకుండా ఎంతో కూల్ గా కనిపిస్తూ ప్రత్యర్థుల్లో భయాన్నిపుట్టిస్తూ ఉంటాడు ధోని అని అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. ఇక అతని కెప్టెన్సీలో ఏకంగా మూడుసార్లు భారత జట్టుకి ఐసీసీ ట్రోఫీ అందించాడు. ఐపీఎల్ లో సైతం నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచి గ్రేటెస్ట్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు.


 అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ ఎంతో పేలవంగా ఉంది అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవలే కామెంట్ చేయడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే వీరేంద్ర సెహ్వాగ్ ఇలాంటి హాట్ కామెంట్ చేయడానికి కారణం ఇటీవలే గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడమే అని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు తరఫున ధోని కెప్టెన్సీ ఎంతో పేలవంగా సాగింది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలకు గుప్పించాడు.



 ఎంతో అనుభవం ఉన్న మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చేసిన పొరపాట్లు తనను ఆశ్చర్యానికి గురిచేసాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశ్ పాండేను ధోని ఉపయోగించిన విధానాన్ని సేహ్వాగ్ తప్పుపట్టాడు. భారీగా పరుగులు ఇచ్చిన తుషార్ తో కాకుండా మోయిన్ అలీతో ధోని మధ్యలో ఒక ఓవర్ వేయించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు. ధోని తరచుగా అలాంటి పొరపాట్లు చేస్తాడని ఆశించరు. కానీ కుడి చేతివాటం బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ స్పిన్నర్  తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాల్సింది అంటూ  అభిప్రాయపడ్డాడు. దేశవాలి క్రికెట్ లో పాత బంతితో బౌలింగ్ చేసే తుషార్ తో ఆరంభంలో కొత్త బంతితో ఓవర్లు వేయించడం ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: