ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసినా ఒకే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి దాదాపు రెండేళ్ల నుంచి కష్టపడి ఇక వరుసగా విజయాలు సాధిస్తూ మెరుగైన రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇక ఫైనల్ వరకు చేరుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫైనల్ పోరులో విజయం సాధించి సంప్రదాయమైన క్రికెట్లో విశ్వవిజేతగా నిలవాలని.. ఇరుజట్లు కూడా పట్టుదలతో ఉన్నాయి. అయితే గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఓడిపోయి నిరాశ పరిచిన ఇండియా ఇప్పుడు మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకుండా విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.



 మొదటిసారి డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెట్టిన పటిష్టమైన ఆస్ట్రేలియా సైతం ఫైనల్లో విజయం సాధించి సత్తా చాటాలని ఆశిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా  మారబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఎంతోమంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూ లతో అంతకంతకు అంచనాల పెంచేస్తూ ఉన్నారు. అదే సమయంలో యాజమాన్యాలు కూడా గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.




 డబ్ల్యూటీసి ఫైనల్ నేపథ్యంలో ఇక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టు కోసం బ్యాక్ రూమ్ కన్సల్టెంట్ గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండి ఫ్లవర్ ను నియమించుకుంది అన్నది తెలుస్తుంది. ఇంగ్లాండులోని పిచ్ పరిస్థితులపై ఆండి ఫ్లవర్ కు అపార అనుభవం ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందట. కాగా లండన్లోని ఓవల్ మైదానం వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా ఈ ఫైనల్ మ్యాచ్  జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: