అయితే విదేశీ క్రికెట్ బోర్డుల విషయం పక్కన పెడితే ఇక మన దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అసోసియేషన్ లు ఇక తమ తమ రాష్ట్రం తరఫున ప్రత్యేకమైన ప్రత్యేకమైన లీగ్ లు నిర్వహిస్తున్నాయ్. ఈ క్రమంలోనె ఐపీఎల్ మాదిరిగానే ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించడం లాంటివి చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలం ప్రక్రియ కూడా పూర్తయింది అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన వేలంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి అత్యధిక ధర పలికాడు.
ఏకంగా హనుమ విహారిని రాయలసీమ కింగ్స్ జట్టు 6.6 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది అని చెప్పాలి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. అయితే ఇతర జట్లు అతని కోసం పోటీ పడినప్పటికీ చివరికి రాయలసీమ కింగ్స్ అతని సొంతం చేసుకుంది. ఇక మరో ప్లేయర్ ధీరజ్ను 5.2 లక్షలకు గోదావరి టైటాన్స్ దక్కించుకుంది అని చెప్పాలి. కాగా గత సీజన్లో కొంతమంది ఆటగాళ్లను ఆయా జట్లు రిటైన్ చేసుకోగా.. 580 మంది ఆటగాళ్లతో వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే 120 మంది ప్లేయర్లను ఆరు జట్లు కొనుగోలు చేశాయి. అయితే ఇలా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో అత్యధిక ధర పలికిన హనుమ విహారి ఇక ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి