ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని మరి ఈ మ్యాచ్ చూడాలని ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై కూడా ఇలాంటి ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి ఆ మ్యాచ్ వర్షార్పనం అయింది అన్న విషయం తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం కురవడం ఆగకపోవడంతో చివరికి మ్యాచ్ రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే పాకిస్తాన్, భారత జట్టు సూపర్ 4 కి చేరుకున్నాయి.అక్కడ మరోసారి తడబడాల్సి ఉంది.
అయితే ఇక సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సిన తేదీ రోజు కూడా అటు వర్షపు సూచనలు ఉండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే శ్రీలంక వాతావరణ శాఖ అధికారులు అభిమానులందరికీ ఊరటను ఇచ్చే వార్త చెప్పారు. ఈనెల 10వ తేదీన జరగబోయే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి పెద్దగా వర్షపు ముప్పు లేదు అంటూ స్పష్టం చేశారు. ఒకవేళ ముందు రోజు వాన కురిసినప్పటికీ పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈనెల పదవ తేదీన అయినా పూర్తిస్థాయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసి తరించుపోవాలని క్రికెట్ లవర్స్ అందరూ కూడా సిద్ధం అయిపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి