
అయితే ప్రపంచకప్ లో మిగిలి ఉన్న మ్యాచులలో కూడా టీమ్ ఇండియా ఇదే జోష్ కంటిన్యూ చేయాలని అటు భారత అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ కూడా మంచి ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అటు టీమిండియా యాజమాన్యం కూడా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే ప్రతి మ్యాచ్ లో కూడా బరిలోకి దిగుతుంది అని చెప్పాలి. దీంతో బెంజ్ పై కూర్చున్న ఆటగాళ్లు ఇక బెంచ్ కి పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలోనే టీ20 మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా బెంచ్ కే పరిమితం అయ్యాడు.
అయితే అతను తుది జట్టులో చోటు దక్కించుకోకపోయినప్పటికీ ఇటీవలే వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. మొదటి మ్యాచ్ సమయంలో డగ్ అవుట్ లో కూర్చున్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ ఏదో తింటున్నట్లు కెమెరా కంటికి చిక్కాడు. ఇది గమనించిన సూర్య కుమార్ యాదవ్ తినడం ఆపేసి కదలకుండా అలాగే ఉండిపోయాడు ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రియాక్షన్లకు నేటిజన్లు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ దీనిపై స్పందిస్తూ అలా డగ్ అవుట్ లో తింటూ కూర్చోవడం ఎందుకు మైదానంలోకి దిగి సిక్స్సర్లు ఫోర్లు కొట్టు అంటూ పోస్ట్ చేయగా.. దీనికి సూర్యకుమార్ రిప్లై ఇచ్చాడు. హలో బ్రదర్.. నాకు ఆర్డర్ చేయకు.. స్విగ్గిలో ఆర్డర్ పెట్టు అంటూ రిప్లై ఇవ్వగా.. ఇది వైరల్ గా మారిపోయింది.