సాదరణంగా క్రికెట్ ని ఫ్యాషన్ గా మార్చుకుంటూ ఇక అటువైపుగా అడుగులు వేసే ప్రతి ఆటగాడు కూడా ఇక జెర్సీ నెంబర్ విషయంలో కూడా కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చిన నెంబర్ ని జెర్సీ నెంబర్గా మార్చుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో ఒకవేళ లెజెండ్ గా ఎదిగితే అతనిని జెర్సీ నెంబర్ ఏకంగా ఒక బ్రాండ్ గా మారిపోతూ ఉంటుంది. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జెర్సీ నెంబర్ ఇలాగే బ్రాండ్ గా మారిపోయింది. జెర్సీ నెంబర్ సెవెన్ కనిపించింది అంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు.


 ఇక విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18ని చూసిన కూడా ఇక ఫ్యాన్స్ ఇలాగే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి ఆటగాడి జెర్సీ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఇక తన జెర్సీ నెంబర్ 77 వెనుక కూడా ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అంటూ చెబుతున్నాడు భారత స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్. అయితే మొదట తాను జెర్సీ నెంబర్ 7 ని తీసుకోవాలి అనుకున్నాను అంటూ ఆసక్తికర విషయాన్ని కూడా ఇటీవల అభిమానులతో పంచుకున్నాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ క్రికెటర్ ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు..


 తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ చెప్పుకొచ్చాడు శుభమన్ గిల్. అంతే కాదు తన జెర్సీ నెంబర్ 77 వెనుక ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ని కూడా తెలిపాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడుతున్న సమయంలో జెర్సీ నెంబర్ ఏడు కోసం ఎంతగానో ట్రై చేశాను. కానీ ఆ జెర్సీ నెంబర్ అందుబాటులో లేకపోవడంతో తన జెర్సీ నెంబర్ను 77 గా మార్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియాలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇషాన్ కిషన్. ఇక జట్టులో నా నిక్ నేమ్ కాక. అంటే పంజాబీలో బేబీ అని అర్థం వస్తుంది అంటూ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు శుభమన్ గిల్. కాగా గిల్ ప్రయత్నించిన జెర్సీ నెంబర్ 7 లెజెండ్ ధోని జెర్సీ నెంబర్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: