అయితే బిసిసిఐ తీసుకున్న నిర్ణయంతో యువ బౌలర్ చేతన్ సకారియా కెరియర్ ప్రశ్నార్ధకంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. అయితే 50 లక్షల బేస్ ప్రైస్ తో అతను ఇక ఈ నెల 19వ తేదీన జరగబోయే వేలంలో పాల్గొనబోతున్నాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో బీసీసీఐ షాక్ ఇవ్వడంతో ఏ ఫ్రాంచైజీ కూడా అతని కొనుగోలు చేసే అవకాశం లేదు అని అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే సకారియాతో పాటు మరో ఏడుగురు బౌలర్లను కూడా ఇలా అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్ల జాబితాలో చేర్చింది బీసీసీఐ.
దీంతో అతని అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉండగా ఇక ఇటీవల బిసిసిఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకుంది. పొరపాటున అతడిని అనుమానాస్పద బౌలర్ల జాబితాలో చేర్చినట్లు క్లారిటీ ఇచ్చింది. అనుమానిత యాక్షన్ కలిగి ఉన్న బౌలర్ల జాబితాలో చేతన్ పేరు లేదు. అది కర్ణాటక కు చెందిన మరో బౌలర్ పేరు. ఇదే విషయాన్ని మేము ఐపీఎల్ ఫ్రాంచైజీ లకు కూడా తెలిపాము అంటూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా తెలిపారు. ఇక ఈ విషయం కాస్త వేలం ముంగిట సకారియాకు భారీ ఊరట కలిగించనుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి