సాధారణంగా ఐసిసి నిర్వహించే వరల్డ్ కప్ టోర్ని ప్రారంభమైనప్పుడు ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరికీ ఒక అంచనా ఉంటుంది. అగ్రశ్రేణి టీమ్స్ అద్భుతంగా రానిస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో  మాత్రం అందరి అంచనాలు తారమారవుతున్నాయి. ఎందుకంటే ఊహించని రీతిలో బాగా రాణిస్తాయి అనుకున్న జట్లు చెత్త ప్రదర్శన చేసి నిరాశ పరుస్తూ ఉంటే.. చిన్న టీమ్స్ మాత్రం అదరగొడుతూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఏకంగా చిన్న టీమ్స్ తో  అగ్రశ్రేణి జట్లు మ్యాచ్ ఆడినప్పటికీ నువ్వా నేనా అన్నట్లుగానే ఇరు జట్ల మధ్య పోరు సాగుతోంది  ఇలా చివరి బంతి వరకు ఉత్కంఠ గా సాగుతున్న పోరులో చివరికి విజయం వరిస్తుంది అన్నది ముందుగా ఊహించడం కూడా కష్టంగానే మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఈ టి20 వరల్డ్ కప్ లో భాగంగా అన్ని టీమ్స్ లో స్కోరింగ్ నమోదు చేస్తూ ఉండడంతో ఈ ఉత్కంఠ రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు కూడా బద్దలవుతున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇంటర్నేషనల్ టి20 లలో భాగంగా ఇటీవల వరల్డ్ కప్ లో మ్యాచ్ ఆడిన వెస్టిండీస్ ఒకసరి కొత్త రికార్డు సృష్టించింది.


 30 లేదా అంతకంటే తక్కువ పరుగులకు ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయి ఆ తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా వెస్టిండీస్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 30 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి మాత్రం 149/9 స్కోర్ చేసింది వెస్టిండీస్. ఇక ఆ తర్వాత తమ లక్ష్యాన్ని ఎంతో అద్భుతంగా కాపాడుకున్న విండీస్ 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: