హద్దులు మించికి చేస్తే ఏదైనా సరే అతి  అనార్థమైపోతుంది అని పెద్ద వాళ్ళు ఊరికి అనరు . ఇప్పుడు ఇదే సామెతను గుర్తు చేసుకొని ఆర్సిబిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు . దాదాపు 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోహ్లీ కల నెరవేరింది అని ఆనందపడాలో. లేకపోతే కోహ్లీ ఇలా ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు అని బాధపడాలో తెలియని అయోమయ సిచువేషన్ లో ఉన్నారు కోహ్లీ ఫ్యాన్స్ . మనకు తెలిసిందే ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది . ఎంతో కష్టపడి జట్టు ఆటగాళ్లు బాగా ప్రాక్టీస్ చేసి ప్రతి ఒక్క మ్యాచ్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఫైనల్ విజేతగా నిలిచారు.


ఈ ఆనందం కేవలం ఆర్సీబీ మెంబర్స్ కి మాత్రమే కాదు యావత్ బెంగళూరు స్టేట్ మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకునే అంత గొప్ప విజయం అంటూ అందరూ మాట్లాడుతూ ఉన్నారు.  దానికి తగ్గట్టే ఆర్ సి బీ ఫైనల్ మ్యాచ్ గెలవగానే బెంగళూరు స్టేట్ మొత్తం బాణాసంచితో ఎలా కలకలాడిపోయిందో అందరూ చూశారు . అయితే ఎవరు ఊహించని విధంగా నిన్న చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఆర్సీబీ కప్ గెలిచింది అన్న ఆనందాన్ని మొత్తం నీరు కార్చేసింది. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? పోలీసులు చెప్పినా కూడా వినకుండా పరేడ్ నిర్వహించాలి అనుకున్న ఆర్సిబి మేనేజ్మెంట్ దా..? లేకపోతే నిర్వహిస్తున్నామని చెప్పినా కూడా తగిన సెక్యూరిటీ  ఇవ్వలేకపోయినా పోలీసులదా..? అంటూ ఫ్యాన్స్ జనాలు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా విమర్శిస్తున్నారు.



 అంతేకాదు ఈ తొక్కిసలాట వాల్ల తాను 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిన కూడా ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు కోహ్లీ.  రీసెంట్ గానే సోషల్ మీడియా వేదిక ఈ ఘటన పట్ల ఎంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను అనే విషయాన్ని షేర్ చేసుకున్నాడు కోహ్లీ . అయితే చాలామంది కోహ్లీ నెగిటివ్గా చేసి చూడడం ఈ తొక్కిసలాటలో దారుణం అంటున్నారు అభిమానులు , కోహ్లీ ఏమి తొక్కిసలాట జరిగేలా ప్లాన్ చేయలేదు..? కోహ్లీ కి ఈ తొక్కిసలాటకి ఎటువంటి సంబంధం లేదు . ఆర్సిబి మెంబర్ లల్లో ఒక్కడు కోహ్లీ .. ఆర్సిబికి ఒక్కడే కోహ్లీ కాదు అంటూ ఫ్యాన్స్ కూసింత ఘాటుగా బదులిస్తున్నారు.  కానీ తాను 18 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో ప్రాక్టీస్ చేసి కప్పు అందుకున్న ఆ ఆనందం మాత్రం కోహ్లీ కళ్ళల్లో కనబడడం లేదు . కేవలం కొన్ని గంటల్లోనే ఐపిఎల్ విన్ అయ్యాము అన్న ఆనందం నీరుగారిపోయింది . కోహ్లీ 18 ఏళ్ల కల ఫ్లాప్ అయిపోయింది అంటూ కొంతమంది వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. కోహ్లీ ఈ బాధ నుంచి ఎలా బయటపడతాడో అంటూ మరి కొంతమంది ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: