ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ కలిగిన క్రికెట్ జట్లలో సౌతాఫ్రికా ఒకటి. సౌతాఫ్రికా జట్టు ఇప్పటివరకు ఎన్నో గొప్ప గొప్ప మ్యాచ్లను గెలిచి తమ అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ జట్టులోని ఓ యువ ఆటగాడు ప్రస్తుతం సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాడు. ఆయన కెరియర్ను మొదలు పెట్టిన మొదటి మ్యాచ్ నుండే రికార్డులను సొంతం చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఆ యువ ఆటగాడు మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ ఆటగాడు ఎవరు ..? ఆయన సొంతం చేసుకున్న రికార్డులు ఏవి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం. కొద్ది కాలం క్రితమే సౌతాఫ్రికా జట్టులోకి మాథ్యూ బ్రీట్జ్కే అనే ఆటగాడు ఎంట్రీ ఇచ్చాడు.

ఈయన జట్టు లోకి రావడం ఆలస్యం రికార్డులను నెలకొల్పుతో వెళ్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికా , ఇంగ్లాండ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో కూడా మాథ్యూ బ్రీట్జ్కే అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్ లో మాథ్యూ బ్రీట్జ్కే 77 బంతుల్లో 7 ఫోర్లు , 3 సిక్సర్లతో , 85 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తో  మాథ్యూ బ్రీట్జ్కే వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు మాథ్యూ బ్రీట్జ్కే 5 వన్డే మ్యాచ్లలో ఆడాడు. ఐదు వన్డే మ్యాచ్ లలో కూడా 50 కి పెంచిన పరుగులు చేశాడు. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఆటగాడు కూడా వరుసగా ఆడిన 5 వన్డే మ్యాచ్ లలో 50 కి మించిన పరుగులు చేయలేదు.

దానితో మాథ్యూ బ్రీట్జ్కే ఆడిన 5 వన్డే మ్యాచ్ లలో ఐదింటిలో కూడా 50 కి మించిన పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డును సృష్టించాడు. పాకిస్తాన్ వేదికగా జరిగిన ట్రై సిరీస్ లో భాగంగా కివీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాథ్యూ బ్రీట్జ్కే వన్డే ల్లోకి అరం గేట్రం చేశాడు. ఈ మ్యాచ్ లో 148 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఇలా ఈ యువ ఆటగాడు వన్డే లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ లలో 50 కి మించిన పరుగులు చేసి వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: