
ఇక కార్తీక దీపం సీరియల్ ఎంత మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సీరియల్ అంతలా రేటింగ్స్ సాధిస్తుంది. ఈ సీరియల్ లో వంటలక్క అంటే దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటించింది. ప్రేమి విశ్వనాధ్ కోసమే సీరియల్ చూసేవారు చాలా మంది ఉన్నారు. ఈ సీరియల్ కి వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోకి కూడా ఎంటర్ అయింది. తెలుగు లో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రం లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ప్రేమి విశ్వనాథ్ మలయాళ స్టార్ హీరో జయ సూర్యకు దగ్గరి బంధువు. ఆమెకు జయసూర్య కజిన్ అవుతారు. అయిన సరే స్టార్ హీరో జయ సూర్య ప్రమేయం లేకుండా సొంత టాలెంట్ తో సిరియల్స్ నుండి సినిమాల వరకు వచ్చింది.
ఇక ప్రస్తుతం తెలుగు ఆడపడుచులకు ఈమె ఎంతలా చేరువయ్యేందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్రేజ్‌ను ఇపుడు కార్పోరేట్ కంపెనీ లు కూడా గుర్తించాయి. అందుకే హీరోయిన్స్‌ను ఒదిలిపెట్టి చాలా మంది ఆమెతో యాడ్ షూట్స్ చేస్తున్నారు. తాజాగా డబుల్ హార్ట్స్ మినపగుళ్లు వాళ్లు కార్తీక దీపం ఫేమ్ వంటలక్కతో యాడ్ చేసారు. ఇక వంటలక్క త్వరలో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.