సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు గా మారిన వారి లిస్ట్ లో అషు రెడ్డి కూడా ఒకరు. బిగ్ బాస్ వంటి బిగ్ ఫ్లాట్ ఫామ్ లోనూ చోటు సంపాదించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ అమ్మడు అందాలకు యువత ఫిదా అవుతోంది. సమంత లా లుక్ ఉన్న ఈ అమ్మడు అందరి కంట్లో పడి జూనియర్ సమంత లా పేరు కూడా తెచ్చుకుంది. ఆ మధ్య ఓ కామెడీ షో లో ఎక్ష్ప్రెస్స్ హరితో కలిసి ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంతా వీరి మద్య ఏదో ఉందని అనుకున్నారు. వీరి వ్యవహారం కూడా స్టేజి పై అలానే కనిపించింది అనుకోండి అది వేరే విషయం. ఇక ఆ తరవాత మరో షో లో యాంకర్ రవి తో కలిసి బాగా రెచ్చిపోయి యాంకరింగ్ చేసింది.

ఇక ఆ తరవాత ఇటీవల ఓ టి టి లో  ప్రసారమైన బిగ్ బాస్ లోనూ అవకాశం అందుకుని మళ్ళీ తన బజ్ క్రియేట్ చేసింది. ఇక హౌజ్ లో తోటి కంటెస్టెంట్ అజయ్ తో ఈ అమ్మడు చాలా క్లోజ్ గా మూవ్ అయిన విషయం తెలిసిందే. షో  కాస్త ముగియడంతో మళ్ళీ సోషల్ మీడియాలో దూకుడు పెంచింది అషూ. తాజాగా ఈమె చేసిన పోస్ట్ ఒకటి ట్రోల్స్ మద్య చిక్కుకుంది. అజయ్ ఇంకా అధు రెడ్డి కలిసి వారి కుక్కపిల్లతో సరదాగా కూర్చుని ఉన్న ఫోటోని అషు సోషల్ మీడియా అకౌంట్  లో పోస్ట్ చేయగా...ఏంటి బిగ్ బాస్ అయిపోయినా ఇంకా మీరు క్లోజ్ గానే ఉన్నారా...అంటే ఏదో తేడా కొడుతోందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కానీ ఈ విషయంపై ఇంకా ఏ క్లారిటీ రాలేదు. అయితే ఇక్కడ ఇవన్నీ మాములే అయినప్పటికీ... సోషల్ మీడియా ఎవరినీ అంత తేలిగ్గా వదలదు. మరి ఈ విషయం గురించి అషూ ఏమైనా స్పందిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. కాగా గత కొద్ది రోజుల క్రితం సింగర్ రాహుల్ సింప్లి గంజ్ తోనూ సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు వీరి గురించి వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో చూశాము. చివైరికి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ శుభం కార్డు వేశారు. మరి ఇక్కడ ఏమి జరుగుతుందో?
   

మరింత సమాచారం తెలుసుకోండి: