బిగ్ బాస్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఆరు సీజన్లోని పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ ని ఈ మధ్యనే మొదలుపెట్టింది. గత సీజన్ ఫ్లాప్ అవడంతో ఎలాగైనా సరే ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేసి సీజన్ 7 ని సెప్టెంబర్ మూడవ తేదీన గ్రాండ్గా అట్టహాసంగా మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు వారాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ షో ఇప్పుడు మూడో వారం కూడా ఈ రెండు రోజుల్లో ముగియబోతోంది. ఇక ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే ఈసారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ కూడా అయ్యారు.  ఇక ఈవారం కూడా హౌస్ లో ఎలిమినేషన్ జరగనుంది. మరి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్న విషయం మరింత ఆసక్తికరంగా ఉంది. ఇకపోతే ఈసారి బిగ్ బాస్ 7 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో సింగర్ దామిని కూడా ఒకరు అని చెప్పాలి. హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటూ వంటలక్కగా పేరు తెచ్చుకున్న ఈమె.. తన అందమైన గాత్రంతోనే కాదు అద్భుతమైన రూపంతో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇక బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని అప్పటినుండి వరుస ఆఫర్లను అందుకుంటుంది దామిని.దామిని ఇప్పటివరకు పాడింది పదుల సంఖ్యలో అయినా సరే పాపులారిటీ మాత్రం భారీగా సంపాదించుకుంది. ఇక ముందు నుండి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె పాటలతో మాత్రమే కాదు తన బ్యూటిఫుల్ ఫోటోలతో కూడా అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఈవారం ఎలిమినేట్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె రెమ్యునరేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈమె వారానికి రూ .2 లక్షల రూపాయలు చొప్పున.. ఇప్పుడు 3 వారాలకు గానూ రూ .6లక్షల రూపాయలు అందుకోబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: