తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ మొదటి భాగం క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పాల్సిన పనిలేదు.. దేశంలోనే అత్యధిక టిఆర్పి రేటింగ్ సాధించిన సీరియల్ గా ఒక చరిత్రను సృష్టించింది.ఇందులో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరూపమ్ పరిటాల నటించగా.. ఇందులో వీరందరికీ ఎంత క్రేజీ వచ్చిందో లేడీ విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టి(మోనిత) కి కూడా అదే లెవల్లో క్రేజీ లభించింది. కార్తీకదీపం సీజన్2 వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో అడుగుపెట్టగా శోభాశెట్టికి దెబ్బేసింది. ఈమెకు ఇందులో ఊహించని విధంగా చాలా నెగెటివిటీ ఏర్పడింది.


ఆ తర్వాత మళ్లీ ఎలాంటి ప్రాజెక్టు కూడా దక్కలేదు. తాజాగా జబర్దస్త్ వర్ష చేసేటువంటి ఒకటాక్ షోకి గెస్ట్ గా వచ్చింది శోభా శెట్టి. అందులో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకుంది. తన లవ్ ప్రపోజ్ ని యశ్వంత్ అంత సులువుగా ఒప్పుకోలేదని తెలియజేసింది. ఇక ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. పెళ్లి ఎప్పుడు అంటూ వర్ష అడగగా.. వాస్తవానికి ఈ ఏడాది ప్లాన్ చేశాము కానీ ఆలస్యం అవ్వడానికి గల కారణాలను తెలిపినట్టుగా ప్రోమోలో చూపించారు.


అలాగే కన్నడ వాళ్లకి తెలుగులో అవకాశాలు ఇవ్వడం పై ప్రశ్నించగా.. కన్నడ, తెలుగు అంటూ ఏమీ లేదు.. మేము యాక్టర్స్ అంతే అంటూ తెలిపింది. తాను బెంగళూరులోకి కొత్తగా వచ్చినప్పుడు ఇల్లు అద్దె తీసుకోవడానికి డబ్బులు కూడా తమ దగ్గర లేవని అప్పుడు తన తల్లి తాళి బొట్టు తాకట్టు పెట్టి మరి అడ్వాన్స్ ఇచ్చానంటూ తెలిపింది.. ఈ సంఘటన అసలు ఎప్పటికీ మర్చిపోలేనని.. అందుకే అప్పుడే డిసైడ్ అయ్యా బెంగళూరులో ఎప్పటికైనా ఒక ఇల్లు కట్టుకోవాలని.. అందుకే కన్నడ, తెలుగు ,తమిళ్ వంటి సీరియల్స్ లో చేశాను అంటూ తెలిపింది శోభా శెట్టి. ఇక ఇవే కాకుండా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది శోభా శెట్టి. ఈ ప్రోమో వైరల్ గా మారుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: