స్మార్ట్‌ఫోన్ ఫోన్ ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు వాట్సాప్‌. సమాచారం సులువుగా ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ మార్గంగా మొదలైన ఈ టెక్‌ వేదిక.. ఇప్పుడు అనేక విధాలుగా  ఉప‌యోగ‌ప‌డుతుంది. దేశంలో కోట్ల మంది వాడుతున్న యాప్‌ వాట్సాప్‌. వాట్సాప్ గురించి తెలియని వారు ఉంటారా.. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. చాలా సులభంగా దీన్ని వాడే సదుపాయం ఉండటం వల్ల ఎక్కువ మంది దీన్ని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

 

మ‌రో వైపు వాట్సాప్ కూడా యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో ముందుకు వ‌స్తోంది.  ఇటీవల పెగసస్ స్పైవేర్ ఎటాక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదొక్కటే కాదు... ఇలాంటి ప్రైవసీ సమస్యలెన్నో వాట్సప్ యూజర్లకు ఉన్నాయి. అయితే మీరు ప్రైవసీ సెక్షన్‌లో సెట్టింగ్స్‌ మారిస్తే మీ వాట్సప్‌ని సేఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్‌ని రిలీజ్ చేసింది వాట్సప్. ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి.

 

వాట్సప్‌లో ఎవరైనా మిమ్మల్ని చికాకుపెడుతుంటే సింపుల్‌గా వారిని బ్లాక్ చేసెయ్యండి. మీరు బ్లాక్ చేశారంటే వాళ్లు మీ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ లాంటి వివరాలేవీ చూడలేరు.  వాట్సప్ గ్రూప్స్ కూడా ఓ పెద్ద సమస్యే. మీ కాంటాక్ట్ నెంబర్ ఉన్నవాళ్లంతా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తుంటారు. మీకు నచ్చకపోయినా గ్రూప్‌లో కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే  ఎవరు మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌లో ప్రైవసీలో గ్రూప్స్‌ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సినట్టుగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: