ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో అత్యవసర పరికరం.వ్యక్తికి సంబంచిన కీలక సమాచారం మొత్తం స్మార్ట్ ఫోన్ లో భద్రపరచడం జరుగుతుంది. ఇలా మన జీవితంలో కీలక పాత్రా పోషిస్తున్న స్మార్ట్ ఫోన్ ఉన్నంటుండి పోగొట్టుకుంటే ఇంకా అంతే సంగతి కొన్ని సందర్భాల్లో వీటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిం వస్తుంది. అయితే ఇలా రోజూ వందలాది మంది తమ స్మార్ట్‌ఫోన్స్ పోగొట్టుకుంటారు. అయితే చాలా మంది ఫోన్ పోగొట్టుకున్న సమయంలో కంప్టైంట్ కూడా ఇవ్వడానికి వెనుకడుగు వేస్తుంటారు. 

 

కేవ‌లం సిమ్ బ్లాక్ చేయిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఆ ఫోన్‌కు సెక్యూరిటీ కోడ్ పెట్టకుండా ఉంటే.. అప్పుడు అందులోని సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కొన్ని ఫీచర్స్ ఉపయోగపడుతుంటాయి. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా అలాంటిదే.  గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ చేస్తే మీ ఫోన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు... గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. 

 

ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ మీ ప్రతీ కదలికను రికార్డ్ చేస్తుంది. ఆ వివరాలన్నీ టైమ్‌లైన్‌లో ఉంటాయి. www.maps.google.co.in ఓపెన్ చేసి మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే యువ‌ర్ టైమ్‌లైన్‌ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అందులో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపు ఉన్నారు? అన్న వివరాలను తేదీల వారీగా చూడొచ్చు. ఈ రోజు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు టుడే పైన క్లిక్ చేస్తే చాలు. చివరిసారిగా మీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: