యాస్పెక్ట్ రేషియో మాత్రం 20:9గా ఉంది. అలానే దీనిలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 3ని కూడా అందించడం జరిగింది. ప్రాసెసర్ విషయాన్ని వస్తే...ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ ని శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను అందించారు. అలానే ఈ బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 6000 ఎంఏహెచ్ ఏ ఉంది.
ఈ ఫోన్ కెమెరా ఫీచర్స్ లోకి వెళితే..... ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉండగా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంది. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరానే కలిగి ఉంది. ఇక ధర విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999 నుంచి ప్రారంభం కానుంది. అదే నేడు విడుదల అయినా శాంసంగ్ గెలాక్సీ ఎం51 ధర అయితే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధరను రూ.26,999గా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి