ఈ సరికొత్త బీటా వాట్సాప్ ను మీరు అనుభవించాలంటే, ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. మీరు Android అలాగే iOS కోసం వాట్సాప్ యొక్క తాజా బీటా వెర్షన్‌ను మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. బహుళ-పరికర బీటా ప్రోగ్రామ్ మొదలు పెట్టే ముందు సంస్కరణను పరీక్షించమని, వాట్సాప్ మిమ్మల్ని అడుగుతుంది. అందుకు మీరు అవునని యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే ఈ బీటా వాట్సప్ వెర్షన్ ను మీరు పొందలేరు. అంతేకాదు ఈ సరికొత్త వాట్సాప్ ఫీచర్ ను త్వరలోనే బీటా టెస్టర్ లకు అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది వాట్స్ అప్.
వాట్సాప్‌లో ఈ మల్టీ-డివైస్ సపోర్ట్ మొదట్లో నాలుగు డివైస్‌లలో, స్మార్ట్‌ఫోన్‌లో ఒకేసారి పనిచేస్తుందని తెలిపింది. అయితే ఈ ఫీచర్ మొదట్లో బహుళ స్మార్ట్‌ఫోన్‌లకు మద్దతు ఇవ్వకపోవచ్చని ఇది తెలిపింది. మొబైల్ ఫోన్‌ను వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్‌కు లింక్ చేసే విధానం మామూలుగానే ఉంటుంది. వినియోగదారులు స్మార్ట్ ఫోన్ లో వచ్చే వెబ్ క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇక మిగతా నాలుగు పరికరాలు కూడా ఇలాగే లాగిన్ అవ్వొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సర్వీసులను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సప్ తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి