ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్  ఉద్రిక్తత ఎక్కువ ఉండడంతో పిల్లలకి ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం చేసేవారికి.. ఇప్పుడు ఎక్కువగా ల్యాప్ టాప్స్/టాబ్స్/మొబైల్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ఈ - కామర్స్ సంస్థలు ఏకంగా విద్యార్థుల కోసం, కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు అదే తడువులోనే ఒక దిగ్గజ సంస్థ అయినటువంటి, ఒక కంపెనీ ల్యాప్ టాప్ ను  తక్కువ ధరకే అందించనుంది. దాని యొక్క విషయాలు తెలుసుకుందాం.

ప్రముఖ సంస్థ asus కేవలం రూ.17,999 లకే  ఒక ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. ఇందులో పలు రకాల (CROME BOOK C214,C223,C423,C523)  మోడల్స్ ను విడుదల చేసింది. ఈ మోడల్స్ లో CHROME BOOK C423,C523 ఈ రెండు మోడల్స్ లో టచ్ స్క్రీన్, నాన్ టచ్ స్క్రీన్ లతో మనకు లభిస్తాయి. ఈ ల్యాప్ టాప్స్ ను చిన్న పిల్లల కోసం, ఎంటర్టైన్మెంట్ చూసే వారి కోసం రూపొందించినదట.

ఈ ల్యాప్ టాప్  యొక్క ఫీచర్ల విషయాలను చూస్తే.. chrome book C223 మోడల్ ధర అతి తక్కువ ధరకే లభించనుంది. దీని ధర కేవలం 17,999 రూపాయలే. ఇక c423 నాన్ టచ్ స్క్రీన్ లాప్ టాప్ ధర 19,999 లకే, c523  నాన్ టచ్ ల్యాప్ టాప్ మోడల్స్ ధర రూ.20,999 లకే, c423 టచ్ స్క్రీన్  మోడల్ ధర రూ.23,999 లకే,c523 టచ్ స్క్రీన్ మోడల్ ధర రూ.24.999 లకే, ఇక అంతే కాకుండా C214 ధర  రూ.23,999 రూపాయలకే ఈ ల్యాప్ టాప్ లి మనకి దొరుకుతాయి.

ఈ ఆఫర్ ను asus సంస్థ ఈ నెలలోనే జులై 22న రాత్రి 12 గంటల సమయం నుంచి ఈ ఆఫర్ లు flipkart లో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. రాబోయే ఆఫర్ ను  చేజారనివ్వకండి.



మరింత సమాచారం తెలుసుకోండి: