ఇక ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన ప్రత్యర్డుల కంటే టెస్లా చాలా వేగంగా ప్రణాళికలను రచిస్తుంది.ఇక గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలను టెస్లా జరిపడం జరిగింది.అయితే ఇక ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూసుకెళ్తున్న అపర కుబేరుడు ఎలోన్ మస్క్ బ్యాటరీలు ఇంకా కొత్త కర్మాగారాలు అలాగే కొత్త కార్ల నమూనాల పరంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇక గత కొద్ది నెలల నుంచి టెస్లా షేర్ విలువ కూడా పడిపోవడంతో పాటు మార్కెట్లోకి కొత్త పోటీదారులు దూసుకొనిరావడంతో టెస్లా విషయంలో పెట్టుబడుదారులు పెట్టడానికి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయితే ఇక ఈ ప్రశ్నలకు సమాధానంగా గత సెప్టెంబర్ నెలలో ఎలోన్ మస్క్ కొత్త డిజైన్ తో తన స్వంత బ్యాటరీ సెల్స్ ను ఉత్పత్తి చేయడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించడం జరిగింది.ఇక రాబోయే కొత్త తరం బ్యాటరీలు అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి అని ఎలన్ మస్క్ పేర్కొనడం జరిగింది.

ఇక ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు వాహనాల తయారీ ఖర్చు కూడా తగ్గనున్నట్లు తెలిపడం జరిగింది. టెస్లా కంపెనీ రాబోయే మూడు సంవత్సరాలలో $25,000 (సుమారు రూ.18 లక్షలు) కారును తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది అని తెలిపారు.. ఇక వచ్చే ఏడాది నుంచి కొత్త తరం 4680 బ్యాటరీలు ఎక్కువ మొత్తంలో తయారు చేయడంతో పాటుగా అలాగే నిర్మాణంలో ఉన్న టెక్సాస్ కర్మాగారం నుంచి రాబోయే మోడల్ వైలో వాటిని ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పడం జరిగింది.ఇక ఇప్పుడు, 4680 బ్యాటరీల సామర్ధ్యంతో వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా టెస్లా కంపెనీ పెట్టుకున్నట్లు ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు రాయిటర్స్ కు చెప్పడం జరిగింది. ఇక టెస్లా 4680 బ్యాటరీలను అభివృద్ధి చేయడానికి పానాసోనిక్ తో కలిసి పనిచేయనున్నట్లు ఎలన్ మస్క్ చెప్పడం జరిగింది. ఇక మరో టెస్లా సరఫరాదారుడు ఎల్‌జీ కంపెనీ 2023 సంవత్సరం నాటికి టెస్లా కంపెనీ కోసం 4680 బ్యాటరీ సెల్స్ ను ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తోందని రాయిటర్స్ ఇంతకు ముందు నివేదించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: