సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఇంధన అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే ఉన్నది ఒక్కటే భూమి దానిలో నిక్షిప్తం అయినా ఏ ఖనిజసంపద అయినప్పటికీ వాడేకొద్దీ అడుగంటిపోతుంది. అలాగే నేటి వాడకం కూడా జనాభాను బట్టి తీవ్రంగానే ఉంటుంది. ఇప్పటికే ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్న అనేక దేశాలలో కూడా అది అడుగంటే పరిస్థితి వస్తున్నదని వార్తలు కూడా వచ్చేశాయి. అందుకే తగిన ప్రయత్నాలు లేదా ప్రత్యామ్నాయాలు ప్రపంచం వెతుకుతుంది. నీటి ఆవిరితో నడిచేవి, కరెంటుతో నడిచేవి, ఇలా ఎన్నో రకాల ఇంధనాల ఆవశ్యతకను కనుగొంటున్నారు. ఆ విధంగా అడుగంటుతున్న ఇంధనాల ఆవశ్యకతను తగ్గిస్తూ, కొత్త రకాలను వాడే విధంగా అనేక రూపకల్పనలు చేస్తున్నారు. తాజాగా అణు శక్తితో నడిచే వాహనాలను కూడా కనుగొన్నారు.

అయితే ఇవి మనన రవాణా కు ఉపయోగించేవి కావు, కేవలం జలాంతర్గాముల కోసం ప్రస్తుతం వాడుతున్నారు. అణు శక్తి అంటేనే నేటి ప్రపంచం భయానికి లోనవుతుంది. దాని ప్రభావం రెండో ప్రపంచ యుద్ధంలో చవిచూసింది కాబట్టి ఆ మాత్రం భయం ఉండటం తప్పేమి కాదు. కానీ మనిషి తన అవసరాలను వాడుకోవడంలో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉదాహరణకు, వంటకు వాడే గ్యాస్, కరెంటు లాంటివి కూడా ప్రమాదమే కదా. వాహనాల్లో వాడే పెట్రోల్, డీజిల్ కూడా ప్రమాదమే, అయినా వాడుతున్నాం కదా. అయితే ఇక్కడ అణు వాడకంలో తప్పేముంది అనుకోవచ్చు కానీ, వాడేవాళ్ళను బట్టి అది తప్పుడు పని అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రపంచం భయపడుతుంది.

అణు శక్తితో నడిచే వాహనాలు పెరిగిపోవచ్చు అనుకుంటే, వాటిలో ఉన్న అణు శక్తికి వాడే ముడిపదార్దాన్ని కొందరు వేరే విధంగా అంటే, అణు బాంబులు గట్రా చేయడానికి ఉపయోగిస్తే .. అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే దానిని అంత త్వరగా సాధారణ ఇంధనంగా ప్రపంచం ఒప్పుకోకపోవచ్చు. అయినా ఇప్పటికి జలాంతర్గాములలో వాడుతున్నది, రేపు సాధారణ వాహనాలలో కూడా వాడవచ్చు. అలాంటి స్థితికి చేరడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు లేదా అప్పటికి మరో ఇంధనం అందుబాటులోకి రావచ్చు కూడా. అణు ఇంధనంతో మరో ప్రమాదం, రేడియేషన్ కూడా ఉండొచ్చు. అది పెరిగిపోతే ఇంకాస్త మనిషి జీవితం దిజగారిపోతుంది. కొత్త రోగాలు లాంటివి తాండవించే అవకాసమ్ ఉంటుంది. భూమిపై రేడియేషన్ పెరిగితే ఉన్న గాలి, నీరు కాస్త కలుషితం అయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. అయినా చూద్దాం అప్పటి కల్లా మరో ఇంధనం అందుబాటులోకి వస్తుందేమో అని.

మరింత సమాచారం తెలుసుకోండి: