అత్యాధునిక టెక్నాలజీలు పెరిగిపోతున్న నేపథ్యంలో  చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండడం గమనార్హం . ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన రోజు నుంచి బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం అయ్యాయి. కేవలం ఒకే ఒక్క క్లిక్ తో ఏకంగా లక్షల రూపాయలను ఇతరుల ఖాతాలోకి బదిలీ చేయవచ్చు. ఇక ఇదే సమయంలో హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం కూడా విపరీతంగా పెరిగిపోతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. హ్యాకర్ల బారిన నుంచి మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే హ్యాకర్ల బారిన పడి లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈక్రమంలోనే స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండడానికి కొన్ని సులభమైన మార్గాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ లను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఎలాంటి హ్యాకింగ్ లేదా ఎర్రర్ నుంచి రక్షించడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం చాలా అవసరం. ఎన్నో స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఫోన్ కి సంబంధించిన అప్డేట్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ ప్యాచ్లు అలాగే కొత్త ఫీచర్లు ఫోన్ కి పరిచయం చేయబడుతున్నాయి. మీ స్మార్ట్ ఫోన్ అత్యంత సురక్షితమైన వెర్షన్ లో మాత్రమే కొనసాగేలా చూసుకోవాలి.ఇక అంతే కాదు ప్లే స్టోర్ యాప్ స్టోర్ లలో వేలాది రకాల యాప్ లు  ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేపథ్యంలో భద్రత కోసం సురక్షితమైన యాప్ లను మాత్రమే ఉపయోగించాలి.

ఇక మీ ఫోన్ నుంచి మీ డేటాను మరెవరికీ బదిలీ చేయకూడదు . వ్యక్తిగత సమాచారాన్ని ఆక్సిస్ చేయమని అడిగేటటువంటి యాప్ లను డౌన్లోడ్ చేసుకోకపోవడమే మంచిది. అంతేకాదు మీరు ఉపయోగించని యాప్ లను కూడా పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి. ఇక పబ్లిక్ వైఫై ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉపయోగించకూడదు. అలాగే బస్టాండ్ , రైల్వే స్టేషన్ లో ఉచితంగా వచ్చే వైఫై ని కూడా ఉపయోగించకూడదు. ఇక ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే హ్యాకర్ల బారిన పడకుండా మన స్మార్ట్ ఫోన్ సేఫ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: