ప్రముఖ భారతీయ బ్రాండ్లలో ఒకటైన బోట్ తన సరికొత్త స్మార్ట్ వాచ్ ని మన దేశంలో విడుదల చేయడం జరిగింది. దీని సైజు 1.69 అంగుళాల టచ్ డిస్ప్లే కలదు. Spo 2 మానిటర్, హార్ట్ రేట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా కలవు. ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఏడు రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ.1,799 రూపాయలుగా నిర్ణయించారు. దీనిని నిన్నటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లిప్ కార్ట్ లో విడుదల చేశారు. ఇక ఇందులోని కలర్లు బ్లూ, బ్లాక్, బర్గండీ కలర్ ల లో ఈ స్మార్ట్ వాచ్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ వాచ్ 12 నెలల వరకు వారంటీ లభిస్తుంది.

Boat wave ఫీచర్స్:
ఈ స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల డిస్ప్లే కలదు.. దీని రిజల్యూషన్ 454x454 కలదు.2.5 డి కార్వర్డ్ స్క్రీన్,550 నిట్స్ ప్రయత్నిస్తే వంటి ఫీచర్లు కూడా కలవు. ఇక ఈ వాచీలు వాచ్ కేసును కష్టమై చేసుకునే అవకాశం కూడా కలదు. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్ సెన్సార్ తో కూడా చూసుకోవచ్చు. వీటితో పాటుగా స్ట్రెస్ మానిటరింగ్, ట్రాకర్ ద్వారా స్ట్రెస్ ను కూడా క్యాలిక్యులేషన్ చేయవచ్చు.

ఇక ఈ స్మార్ట్ వాచ్ ని మన మొబైల్ కి కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులోనే కాల్స్ ,టెక్స్ట్ వంటి నోటిఫికేషన్లు కూడా మనం చూసు కోవచ్చు. వాకింగ్, రన్నింగ్, యోగ తదితర క్రీడలకు సంబంధించి వాటిని స్పోర్ట్స్  మోడ్ ద్వారా ఆన్ చేసుకుని వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ios వంటి వాటిని కూడా ఈ స్మార్ట్ వాచ్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.4,ios -8.0 ఆపైన వర్షన్ కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దీని బరువు మాత్రం కేవలం 35 గ్రాములు కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: