ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ కంపెనీ 'హీరో మోటోకార్ప్'  ఇండియన్ మార్కెట్లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది.ఇక ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'హీరో విడా' (Hero Vida). దీనిని కంపెనీ వి1 అని పిలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటరు గురించి మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.హీరో మోటోకార్ప్  'విడా' ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 'వి1 ప్రో' (V1 Pro) ఇంకా 'వి1 ప్లస్' (V1 Plus). వీటి ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఇంకా రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).హీరో మోటోకార్ప్  ఈ వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి ఢిల్లీ, జైపూర్ ఇంకా బెంగళూరు నగరాల్లో లాంచ్ చేస్తుంది, ఆ తరువాత మిగిలిన నగరాల్లో లాంచ్ చేస్తుంది. అయితే డెలివరీలు డిసెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభమవుతాయి. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కొనుగోలుదారులు ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.హీరో మోటోకార్ప్  మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.


ఇందులో ఎల్ఈడీ లైటింగ్, ఫాలో-మీ హోమ్ హెడ్లాంప్, కీలెస్ ఎంట్రీ, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి వాటితో పాటు 7 ఇంచెస్ TFT స్క్రీన్ ఉంటుంది. దీనిని స్మార్ట్ ఫోన్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.విడా ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ ని కూడా పొందుతుంది.కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఇంకా ఫీచర్స్ కూడా చాలా అధునాతనంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా వాహన వినియోగదారులను ఆకట్టుకోనుంది.హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి రేంజ్ అందించేలా డిజైన్ చేయబడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ ఉపయోగించింది. ఇది పూర్తిగా కంపెనీ తయారు చేసినట్లు తెలుస్తోంది, అయితే రెండు వేరియంట్స్ అందించే పరిధి అయితే ఒకేలా ఉండదు.అందువల్ల Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 80 కిమీ ఉంటుంది.ఇక అదే సమయంలో ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు కూడా వేగవంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: