
అయితే ఒకే యాప్లో వేరువేరు అకౌంట్లను ఉపయోగించుకోవడం చాలా బాగుంటుంది.. అయితే ఇప్పుడు వాట్సప్ ఇలాంటి ఫీచర్ తీసుకురావడం జరిగింది. ఒకే యాప్ లో రెండు వేరు వేరు ఖాతాలను ఉపయోగించే సదుపాయాన్ని కూడా తీసుకురావడం వల్ల వాట్సాప్ వినియోగదారులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.23.5 లో కనిపిస్తుందట. ఈ ఫీచర్ వాట్స్అప్కు సంబంధించిన ఏవైనా అప్డేట్లను సైతం ఎప్పటికప్పుడు అందించే webeta సమాచారాన్ని సైతం గుర్తిస్తుంది. ఈ ఫీచర్ డెవలప్మెంట్ లో ఉండగానే త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఫీచర్ వాట్సప్ బిజినెస్ యాప్ లో కూడా కనిపిస్తుంది సాధారణ వాట్స్అప్ యాప్ లో కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని వాబిట ఇన్ఫో తెలియజేయడం జరిగింది. ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాలి అంటే.. ఒక వ్యక్తి కుటుంబ సభ్యులకు ఒక వాట్సాప్ ఖాతాను సైతం ఆఫీస్ అవసరాల కోసం మరొక కారు ఉపయోగించుకున్నట్లు అయితే రెండు వేరువేరు ఖాతాలను ఉపయోగించుకోవాలి అంటే క్లోనింగ్ యాప్ కచ్చితంగా ఉండాల్సిందే.. అయితే ఇప్పుడు తీసుకురాబోతున్న ఈ సరికొత్త అప్డేట్ ఒక క్లిక్ తో ఖాతాల మధ్యలో మారే అవకాశం ఉన్నదట.. కేవలం సెట్టింగ్ లోకి వెళ్లి అకౌంట్ మార్చుకుంటే మనకు కావాల్సిన అకౌంట్ తో వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. ఇలా రెండు ఖాతాలను ఒకేసారి ఉపయోగించుకునే అవకాశం ఉందని వాబీటా తెలుపుతోంది.