భూమ్మీద లక్షల ఏళ్లుగా వాన అనేది లేకుండా పూర్తిగా పొడిగా ఉండే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఎటు చూసినా కిలోమీటర్ల మేర మంచుతో కప్పబడివున్న అంటార్కిటికా ఖండంలో ఈ ఎడారిని తలపించే ప్రాంతం ఉంది. భూగోళం దక్షిణ ధృవంలో కొన్ని కిలోమీటర్ల లోతుకు మంచుతో కప్పబడి ఉన్న ఖండం అంటార్కిటికా. అత్యంత శీతలమైన ఈ ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. సుమారు 4,800 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలను డ్రై వాలీస్ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడడం కానీ, మంచు కురవడం గాని జరగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 దీంతో ఈ ప్రాం తంలో చాలా వరకు ఒక చుక్క నీళ్లు గాని మంచి కానీ లేకుండా అత్యంత పొడి గా ఉంటుంది. ఎడారిని తలపించే పొడి ప్రాంతంలో  ఏడాది పొడుగునా -14 నుంచి -30 డిగ్రీల సెంటిగ్రేడ్ ల గడ్డకట్టించే చలివుండడం గమనార్హం. నిజానికి అంటార్కిటికా ఖండం లోనే గాలిలో తేమ శాతం ఎక్కువే.అలాంటి మంచు ఖండంలో ఇంతటి పొడి ప్రదేశాలు ఉండడానికి కారణం కాటా బాటిక్ విండ్స్ గా పిలిచే గాలులే కార ణమని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు.

కానీ డ్రై వాలిస్ ప్రాంతానికి చుట్టూ ఫ్రాన్స్ అట్లాంటిక్ గా పిలిచే పర్వతాలు ఉన్నాయి. డ్రై వాలీస్ వైపు వీచే గాలులు ఈ పర్వతాల కారణంగా వాతావరణంలో మరింత పైకి వీస్తాయి. అక్కడి అతి తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడిపోతుంది. ఏ మాత్రం తేమ లేని పొడిగాలులు డ్రై వాలీస్ వైపు ప్రయాణిస్తాయి. వీటిని కాటా బాటిక్ విండ్స్ అంటారు. గాలిలో తేమ లేకపోవడంతో వానలు కురవడం వంటివి అసలే ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: