పూర్తి వివరాల్లోకి వెళితే...గుంటూరు సాయి భాస్కర్ హాస్పిటల్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. అయితే సత్తెనపల్లికి చెందిన గోకుల్‌కు విజయవాడకు చెందిన భావ్యతో జనవరి 9న నిశ్చితార్థం జరిగింది. జూన్ 5న వీరి వివాహ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. అయితే నిశ్చితార్థం జరిగిన నాటి నుండి రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో అప్పమత్తమయిన పెళ్లి కుమారుడి కుటుంబంలోని 20 మంది గుంటూరు సాయి భాస్కర్ హాస్పిటల్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు పెళ్లి కూతురు భవ్య తరుపున కుటుంబ సభ్యులు 20 మంది విజయవాడలో వ్యాక్సిన్ వేసుకున్నారు. మరోవైపు పెళ్లికి వచ్చే తమ బంధులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని వాట్సప్ మెసేజ్ లు..ఫోన్ ల ద్వారా సమాచారమిచ్చారు. ఇక వ్యాక్సిన్ కోసం వచ్చిన కుటుంబ సభ్యులను సాయిభాస్కర్ హాస్పటల్ అధినేత, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అభినందించారు. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి కూతురు కుటుంబ సభ్యులను సన్మానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి