మంటల్లో కాలిపోతున్న ఓ భవనం మందు నిల్చొని ఆ మంట తానే పెట్టినట్టుగా.. కన్నింగ్ గా చిరునవ్వు నవ్వే ఓ పాప ఫోటో మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఈ ఫోటో ఎన్నో మీమ్స్ కి దారి తీసింది. ఇంటర్నెట్ లో బాగా ఇష్టపడిన మీమ్స్ లో ఈ 'డిజాస్టర్ గర్ల్' మీమ్ టాప్ ప్లేస్ లో ఉంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


ఈ మీమ్ లో కనిపించే అమ్మాయి పేరు జో రోత్. జనవరి, 2005వ సంవత్సరంలో తండ్రి.. తన పుత్రిక జో రోత్ ని కాలిపోతున్న భవనం ముందు నిల్చోబెట్టి ఫోటో తీశారు. అప్పటికీ ఆ అమ్మాయి వయస్సు కేవలం నాలుగు సంవత్సరాలే. అయితే అప్పట్లో తండ్రి ఈ ఫోటోని జేపీజీ మ్యాగజైన్ నిర్వహించిన "ఎమోషన్ క్యాప్చర్" కంటెస్ట్ కి పంపించారు. దీనితో 2005వ సంవత్సరం నుంచే ఈ ఫోటో అందరికీ ఫేవరెట్ గా నిలిచింది. కాగా, జో రోత్ కి ప్రస్తుతం 21 సంవత్సరాలు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరొలినా లో విద్యనభ్యసిస్తుంది.



ఈ నేపథ్యంలోనే తన మీమ్ యొక్క ఒరిజినల్ కాపీని విక్రయించి లక్షల డాలర్లు సొంతం చేసుకోవచ్చని ఒక ఈమెయిల్ ద్వారా జో రోత్ కి తెలిసొచ్చింది. దీంతో ఆమె తన తండ్రి సహాయంతో గూగుల్లో సెర్చ్ చేసి 'ఓవర్లీ ఎటాచ్డ్ గర్ల్ ఫ్రెండ్', 'బ్యాడ్ లక్ బ్రియన్' మీమ్స్ యొక్క నాన్-ఫంగబుల్ టోకెన్స్ లక్షల డాలర్లకు అమ్ముడు పోయాయని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. అనంతరం తండ్రికూతుర్లు కలిసి ఒక లాయర్, ఒక మేనేజర్ సహాయంతో తమ మీమ్ యొక్క ఒరిజినల్ డిజిటల్ కాపీని వేలం వేశారు.



ఏప్రిల్ 16వ తేదీన ఈ డిజాస్టర్ గర్ల్ మీమ్ యొక్క నాన్-ఫంగబుల్ టోకెన్ ని 24 గంటల వేలానికి పెట్టగా.. అది 4 లక్షల 30 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీలో 3 కోట్ల రూపాయలకు ఎక్కువే. నిజానికి తమ ఫోటో మహా అంటే 2 లక్షల డాలర్లకు అమ్ముడు పోతుంది ఏమో అని జో అనుకుంది కానీ అది తనని హాఫ్ మిలియనీర్ ని చేస్తుందని ఆమె ఎప్పుడూ భావించలేదట.



నాన్-ఫంగబుల్ టోకెన్ అనగా.. డిజిటల్ సొమ్ము( ఫోటో, వీడియో, ఆడియో) యొక్క ఓనర్ షిప్ కి సంబంధించిన సర్టిఫికెట్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: