సాధారణంగా ఏనుగులను మనం ఎక్కువగా అడవిలోనే చూస్తూ ఉంటాం. ఏనుగుని చూడాలంటే అడవి కి వెళ్ళాలి..అంటే ఏ ఇతర క్రూరమృగాలు వల్ల ఎటువంటి హానీ కలుగుతుందేమో అని భయం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఏనుగులను చూడాలని ఎవరైనా ఆసక్తికరంగా ఉంటారో అలాంటి వారికి ప్రపంచంలోనే 10 అత్యుత్తమ ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ఆ ఏనుగుల ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..


1. చోబ్ నేషనల్ పార్క్ , బోట్స్వానా :
ఆఫ్రికా లోని అత్యధిక ఏనుగుల సంఖ్య కలిగిన పార్క్ ఇది. అందులో సుమారుగా 1,20,000 నుంచి 1,30,000 వరకు ఏనుగులు ఉంటాయి. ఒక ఏనుగులు ఆహారం కోసం జూన్ నుండి నవంబర్ నెల మధ్యలో నది ఒడ్డున నిలబడినప్పుడు, నదిని దాటుతూ ఉన్నప్పుడు చూడడానికి చాలా అద్భుతంగా వుంటుంది.

2. ఎలిఫెంట్ నేచర్ పార్క్,  థాయిలాండ్ :
ఉత్తర థాయిలాండ్ లోని చియాంగ్ మాయి ప్రావిన్స్ లో ఏనుగుల గుంపు చాలానే ఉంది. ముఖ్యంగా థాయిలాండ్ దేశం మొత్తం మీద సర్కస్ లేక క్యాంప్ ల  నుండి రక్షించబడిన కొన్ని పదుల కొద్దీ బాధపడుతున్న ఏనుగుల కోసం ఈ పార్క్ అభయారణ్యంగా పనిచేస్తుంది.

3.న్ఖోటకోట వైల్డ్ లైఫ్ రిజర్వ్ , మలావి :
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఏనుగుల బదిలీలు ఇక్కడ నుంచే జరుగుతాయి. ప్రస్తుతం ఈ బదిలీలను నిలిపి వేయడం జరిగింది. ఇక్కడికి గనుక మనం వెల్లినట్లయితే స్వేచ్చగా, రక్షణలో  తిరుగుతున్న ఏనుగుల గుంపు ని వీక్షించవచ్చు.

4.సాయబౌరీ ఏనుగు సంరక్షణ కేంద్రం, లావోస్ :
లావోస్ ను ఒకప్పుడు మిలియన్ ఏనుగుల భూమి అని పిలిచేవారు. అడవి నిర్మూలించడం , పట్టణాలు అభివృద్ధి చెందడం వంటి కారణాల వల్ల ప్రస్తుతం నాలుగు వందల ఏనుగులు  మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం.

5.హ్వాంగే నేషనల్ పార్క్, జింబాబ్వే :
ప్రస్తుతం ఈ పార్కులో 45,000 ఏనుగులను  మనం చూడొచ్చు.

6.పెరియార్ నేషనల్ పార్క్, ఇండియా :
1978 లో టైగర్ రిజర్వ్‌ గా నియమించబడింది. దక్షిణ భారతదేశంలో విస్తరించబడిన ఈ పార్కులో ఏనుగులను మాత్రమే కాదు వివిధ రకాల జంతువులు, పక్షులు కూడా చూడవచ్చు..

7.ఉడవలవే ఎలిఫెంట్ ట్రాన్సిట్ హోమ్, శ్రీలంక :
ఈ పార్కులో అనాధలుగా మిగిలిపోయిన ఏనుగులను, ఏనుగు శిశువులను తీసుకొచ్చి పెంచుతూ ఉంటారు.

8.అడో ఎలిఫెంట్ నేషనల్ పార్క్, దక్షిణాఫ్రికా :
ఇది దక్షిణ ఆఫ్రికాలోని మూడవ జాతీయ అతి పెద్ద పార్క్. ఏనుగులు, ఖడ్గమృగాలు, హైనాలు, జీబ్రాలు వంటి ఎన్నో మృగాలను చూడవచ్చు.

9.కినాబతంగన్ నది, బోర్నియో :
ఇక  ఈ నదిలో ఏనుగులు సంచరించడం మనం చూడవచ్చు.

10.కటవి నేషనల్ పార్క్, టాంజానియా :
అధిక మొత్తంలో వన్యప్రాణులు ఇక్కడ జీవిస్తాయి. అంతేకాకుండా ఏనుగుల విహారం ఇక్కడ యాత్రికులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: