సాధారణంగా ఉల్లిపాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనకు తెలిసిన విషయమే.. అందుకే పెద్దలు అనేవాళ్ళు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని.. ఉల్లిపాయలలో లభించే పోషకాలు వల్ల మన ఆరోగ్యం నిత్యం యవ్వనంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.. కానీ తాజాగా ఆ దేశం మాత్రం ఉల్లిని చూస్తేనే ఆమడ దూరం పరుగెడుతోంది. అంతేకాదు ఆ దేశంలో ఏకంగా ఆరు వందల యాభై మంది అస్వస్థతకు గురి కావడానికి ఉల్లి కారణమట.. అదెలాగో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


అగ్రరాజ్యమైన అమెరికా లో సరికొత్త వైరస్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ఉల్లిగడ్డల నుంచి వ్యాపిస్తుంది అని తద్వారా ఉల్లిగడ్డలను ఎవరు తినకూడదని ఆ దేశం ప్రస్తుతం ఆదేశాలు జారీ చేసింది.అమెరికాలో సుమారు 37 రాష్ట్రాల్లో 650 మందికి పైగా ప్రజలు  సాల్మొనెల్లా అనే వ్యాధి బారిన పడినట్లుగా సమాచారం. ఇందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే,  మెక్సికోలోని చివావా నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలేనట. దీంతో ప్యాకింగ్‌, స్టిక్కర్‌ లేని ఉ‍ల్లిపాయలన్నింటినీ వెంటనే డ్రైనేజీ లో పారవేయాలని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ హెచ్చరికలు జారీ చేసింది. పచ్చి ఉల్లి తిన్న వెంటనే తాము ఇలాంటి  అనారోగ్యబారిన పడ్డట్టు ఏకంగా 75% మంది బాధితులు వెల్లడించారు.


ముఖ్యంగా సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఎక్కువగా పేగుల పై ప్రభావం చూపిస్తుందట. జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు . అంతేకాదు ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా వ్యాపించినప్పుడు టైఫాయిడ్, పారా టైఫాయిడ్ వంటి లక్షణాలు కనిపిస్తాయట. ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి ఏడు రోజుల పాటు ఈ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడతారు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి అమెరికా రాజ్యమంతా విస్తరించి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మిగతా దేశాలకు కూడా అమెరికా అధ్యక్షుడు సూచనలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: