సోషల్ మీడియాలో వైరస్ అవుతున్న ఈ వీడియోలో విమానం ల్యాండ్ అవుతున్న సందర్భంగా ఒక్కసారిగా భారీ గాలులు అనేవి వీచాయి. దాంతో ఆ విమానం దెబ్బకు ఒకవైపునకు ఒరిగిపోయింది.ఇక ఆ తరువాత ఆ విమానం పల్టీలు కొట్టినంత పని చేసింది. పైలట్ చాలా అప్రమత్తంగా వ్యవహరించి.. సెకన్ల వ్యవధిలోనే ఆ విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశాడు. ఇక ఆ తరువాత తిరిగి మళ్లీ సేఫ్‌గా విమానాన్ని అతను ల్యాండ్ చేశాడు.ఇక ఈ ఘటన లండన్‌లో వెలుగు చూసింది.ఇక బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం 1307 అబేర్డీన్ నుంచి లండన్‌ హీత్రో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. పైలన్ విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసేందుకు ట్రై చేశాడు. అయితే, బలమైన ఈదురు గాలుల కారణంగా విమానం ల్యాండింగ్ అనేది కష్టతరమైంది. తీవ్రమైన గాలుల మధ్యే.. పైలట్ ఆ విమానాన్ని దింపేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది.ఇక ఆ గాలుల దెబ్బకు విమానం అటూ ఇటూ ఊగిపొయింది. విమాన చక్రాలు రెండుసార్లు జంప్ అవుతూ టార్మాక్‌ను బలంగా తగిలాయి. 

ఒకానొక దశలో విమానం తోక భాగం దెబ్బకు రోడ్డుకు తగిలింది. దాంతో అక్కడ బాగా దుమ్ము రేగింది. అయితే, పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్.. చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ విమానాన్ని ల్యాండ్ చేయకుండా అతను టేకాఫ్ చేశాడు. కేవలం నాలుగు నిమిషాల్లో 1,173 మీటర్ల ఎత్తుకు దాన్ని టేకాఫ్ చేశాడు. రెండవ ప్రయత్నంలో ఇక ఆ విమానాన్ని ల్యాండింగ్ చేశాడు పైలట్.అయితే, ఆ విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ విమానం సరిగానే ల్యాండ్ అవుతుందని అతను విశ్వాసం ప్రదర్శించాడు. అయితే, రన్‌వే దగ్గరకు ..దెబ్బకు అతని నమ్మకం పటాపంచలైంది. 'ఓ మై గాడ్' అంటూ కేకలు పెట్టాడు ఇక ఆ వీడియో తీసిన వ్యక్తి. మొత్తానికి ఈ భయనాక ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అది కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్‌గా మారింది.ఇక వైరల్ అవుతున్న ఆ షాకింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
 
https://twitter.com/BigJetTVLIVE/status/1488244084850540549?

మరింత సమాచారం తెలుసుకోండి: