అడవుల్లో ఉండే క్రూరమృగాలు సింహాలు, పులులు, ఎలుగుబంట్లు లాంటివి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరీ వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి జంతువులను టీవీ లో చూస్తేనే భయపడిపోతారు. ఇక నేరుగా చూస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అవుతుంది. కానీ కొంతమంది మాత్రం అడవుల్లో ఉండే క్రూర మృగాలను కూడా ఎంతో చాకచక్యంగా కంట్రోల్ చేస్తారు. భారీ ఏనుగు మావటివాడు మాట విన్నట్లు గానే.. ఇక ఎన్నో సర్కస్ లలో పులులు సింహాలను సైతం సర్కస్ మాస్టర్లు కంట్రోల్ చేయడం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. క్రూర మృగాలు అయినా  పులులు సింహాలు ఎలా సర్కస్ లోని మాస్టర్ల మాట వింటుంది అన్నది మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.


 ఇక ఇలాంటి సర్కస్ లు ఎక్కడైనా జరిగాయి అంటే చాలు క్రూరమృగాలు సర్కస్ మాస్టర్ మాట వింటూ చేసే విన్యాసాలను చూసేందుకు ఎక్కువ మంది వెళుతూ ఉంటారు. అయితే సర్కస్ మాస్టర్ ఎలా చెబితే అలా వింటూ ఎంటర్టైన్ చేసే జంతువులు  కొన్ని కొన్ని సార్లు అదే వ్యక్తిపై దాడి చేయడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక ఊరిలో ఎలుగుబంటి తో ప్రోగ్రాం చేస్తున్నారు కొంతమంది నిర్వాహకులు. ఇందులో భాగంగానే శిక్షకుడి తో కలిసి ఎలుగుబంటి ఎంతో చక్కటి ప్రదర్శన చేసి అందర్నీ కూడా ఎంతగానో అలరించింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా శిక్షకుడి పైన దాడికి పాల్పడింది.


 ఈ క్రమంలోనే పక్కన ఉన్న వ్యక్తులు ఆ ఎలుగుబంటి నివారించేందుకు ప్రయత్నించిన ఆ ఎలుగుబంటి మాత్రం భయపడలేదు. ఏకంగా శిక్షకుడిని తీవ్రస్థాయిలో గాయపరిచింది. దీంతో అక్కడున్న వారందరూ కూడా ఆ ఎలుగుబంటి ని  తప్పించి అతని ప్రాణాలు కాపాడారు అని చెప్పాలి. ఇక ఎలుగుబంటి ఇలా ప్రవర్తించడంతో అక్కడున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. అయితే ఇలా సర్కస్ లో క్రూర మృగాలను ఉపయోగించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: