
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధంలో భారత్ పై చేయి అందుకుంది . ఎన్నో మిస్సయిల్స్ ను స్పాట్లోనే పేల్చేసింది. దానికి ఎన్నెన్నో హైటెక్నాలజీ ఎక్విప్మెంట్స్ కూడా యూస్ చేశారు . అసలు భారత్ - పాకిస్తాన్ ల మధ్య యుద్ధం కోసం భారత్ ఒక్క రోజుకి ఎంత ఖర్చు చేసింది ..? అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. యుద్ధం అంటే ఫిరంగులో.. విమానాలు.. బాంబులే కాదు వేలకోట్ల డబ్బులు కూడా . ఒక దేశం ఒక సారి యుద్ధంలోకి దిగిందంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేసుకోవాల్సిందే . అది అందరికీ తెలుసు .
భారత్ లాంటి భారీ సైనిక సంపత్తి ఉన్న దేశానికి అది చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాగా యుద్ధం అన్నది రోజులు ..నెలలు.. సంవత్సరాల కూడా పడుతుంది . అది ఎవరి చేతుల్లో ఉంటుంది అని చెప్పలేము. ప్రస్తుతం భారత్ కి పాకిస్తాన్ పై జరిగిన వార్ కి రోజుకు ఎంత ఖర్చు అవుతున్నది అనేది దుబాయ్ విదేశీ వ్యవహారాల ఫోరం అంచనా వేసింది . ఆ లెక్క ప్రకారం దాదాపు భారత్ కి యుద్ధం చేయడానికి ఒక్కరోజుకు సుమారు 1460 కోట్ల నుంచి 5000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అంటూ ఆ సంస్థ తేల్చేసింది.
2002 - 2003లో రోజువారి మిలిటరీ వ్యాయం 1460 కోట్లు ..2016 లెక్కలు నాటికి అది ఐదు వేల కోట్లకు చేరుకుంది . కేవలం స్వల్పకాలిక యుద్ధానికి అయ్యే ఖర్చు ఈ రీతిలో ఉంటే ఇక పూర్తిస్థాయిలో యుద్ధం వస్తే మాత్రం సుమారు రోజుకి 1లక్ష 34 వేల కోట్లకు పైగాని ఖర్చవుతుంది. ఇక నెలరోజుల పాటు జరిగితే కలిగే నష్టం 43 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఒక్క నెల రోజులు యుద్దానికి ఇంత డబ్బులు తుడిచిపెట్టకపోతే దాదాపు జనజీవనం అస్తవ్యస్తమైపోవడం ఖాయం అంటున్నారు ప్రముఖులు..!