
కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. కరోనా పుణ్యమా అని ఈ సంవత్సరం జరగాల్సిన టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ రద్దు చేసినట్లుగా నిన్ననే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో విద్యార్థుల్లో రకరకాల భవనాలు కలిగి ఉంటాయి. కొందరు విద్యార్థులు హమ్మయ్య...ఇక పరీక్షల్లేవు హ్యాపీగా ఉండొచ్చు అనుకుని ఉండొచ్చు. ఇంకొంతమంది అరేయ్.... ఎగ్జామ్స్ పెట్టుంటే అంత బాగా రాసి ఉంటానా ? అన్న సందేహం కలగొచ్చు. కానీ ఎవ్వరైతే చదువే ప్రధాన లక్ష్యంగా మరియు ఆయుధంగా కష్టపడి పరీక్షలు ఎప్పుడొస్తాయా మన ప్రతిభను లోకానికి తెలియచేద్దామా అని కళలు కానీ ఉంటారో, వారు మాత్రం తీరని నిరాశకు లోనయి ఉంటారు. అలంటి వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.
* ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకు చదువుల కన్నా బ్రతికి ఉండడమే ముఖ్యం.
* పరీక్షల కన్నా ఈ తరం ప్రాణాలతో ఉండడం ప్రధానం.
* ప్రభుత్వాలు కానీ, కోర్టులు కానీ ప్రజలకు ఏదైతే మంచిదో అదే చేస్తాయి. మీకు నష్టం కలిగించే పని ఎప్పుడూ చెయ్యవు.
* మీరు ఇంకొంతకాలం మీ పుస్తకాలతో కుస్తీ పదండి. మీరు పూర్తి స్థాయిలో పరీక్షలకు సన్నద్ధం కాకపోయి ఉంటే, ఈ సమయాన్ని దానికి ఉపయోగించుకోండి.
* మీరు పరీక్షలు జరగలేదని బాధపడుతున్నారు కదా మీకు మీరే పరీక్షను పెట్టుకోండి, చదివిని విషయాలను మీరే చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. ఇది మీకు మంచి అవకాశం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.
* పరీక్షల ద్వారా వచ్చే మార్కులు మీకు సంఘంలో మంచి పేరును మరియు మంచి ఉద్యోగంన్ని సాధించ్ పెట్టగలవు. కానీ మొదట నిన్ను నువ్వు గెలువు, ఈ పరీక్షల రద్దు సమయంలో నీలో కలిగే వ్యతిరేక ఆలోచనలను చంపి వాటిపై గెలువు.
* ఆ భగవంతుడు కరుణిస్తే అతి త్వరలోనే మనమంతా ఈ కరోనా మహమ్మారి నుండి బయటపడుతాము. ఎప్పటి లాగే స్కూల్స్ కి వెళుతాము. పార్కులు, హోటళ్లు, సినిమాలు ఇలా అన్నింటినీ ఎంజాయ్ చేస్తాము.
* కానీ మనకు కలిగిన ఈ కఠినమైన సమయంలో మాత్రం కరోనా నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందాము.
కాబట్టి నిరాశ పడకండి. దైర్యంగా తరువాత ఎప్పుడు పరీక్షలు జరిగినా అందుకు సిద్ధంగా ఉండండి.