ఓ హిందూ విద్యార్థిని పాకిస్తాన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందె కానీ ఆమె పైన  అత్యాచారం జరిగిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.  ఆమె బలవంతంగా గొంతు నులమడం వల్లే ఊపిరాడక  చనిపోయినట్లు గురువారం పేర్కొంది. బాధితురాలు అత్యాచారం జరిగిన కాసేపటి తర్వాతే  ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ విద్యార్ధి పేరు చాందిని ఈమె సింధ్‌ ప్రావిన్స్‌లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్‌ కాలేజీ విద్యార్థిని,ఈమె సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.


ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 16న తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పలు రకాలుగా వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిని ఏ  మాత్రం సహించని తన సోదరుడు ఈ విధంగా వెల్లడించాడు "తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికి తనం తనకు లేదని అలాంటిది  కాదని".. కచ్చితంగా ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారంటూ ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు.


ఈ నేపథ్యంలో వైద్యులు  ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలు, బాధితురాలి దుస్తులపై ఉన్న రక్తపు మరకలను చూసి  విశ్లేషించిన క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకోలేదు ,ఆమెను  హత్య చేసినట్టు  పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా  తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసు విషయమై కాలేజీలో విచారించగా బాధితురాలు తన హాస్టల్‌ గదిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. అయితే అటాప్సీ నివేదికలో ఆమెపై అత్యాచారం జరిగిందని తేలడంతో ఈ కేసు క్లిష్టతరంగా మారింది. ఈ క్రమంలో ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా సింధ్‌ ప్రభుత్వం ఆదేశించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: