సాధారణంగా మీసాలు, గడ్డాలు అబ్బాయిలకు ఉండటం చూస్తుంటాం. అయితే అక్కడక్కడా కాస్త మీసాలు వచ్చినట్టుగా అవాంఛిత రోమాలతో అమ్మాయిలు కూడా కనిపించడం కూడా సహజమే. కానీ పూర్తిగా అబ్బాయిలకు వచ్చినట్టుగా మీసాలు, గడ్డాలు వస్తే ఎలా ఉంటారు. వాళ్ళు కూడా రోజు షేవింగ్ లాంటివి చేసుకోవాల్సి వస్తుందా.. ఇప్పుడు వారానికి ఒకసారి బ్యూటీ పార్లర్ కు వెళ్ళేవాళ్ళు ఇవి ఉంటె రోజు వెళ్తారా.. ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కదా. వస్తాయి, ఎప్పుడు అసాధారణ విషయాలు చూసినా అప్పుడు సహజంగా ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి. అయితే అవి అన్ని తీర్చుకోవడం సాధ్యపడకపోవచ్చు కానీ, కొన్ని నివృత్తి చేయడానికి ఆయా నైపుణ్యం ఉన్న వైద్యులు వివరణ ఇవ్వగలరు.

ఈ నేపథ్యంలోనే ఒక అమ్మాయికి మీసాలు,  గడ్డాలు రావడం మొదలు పెట్టాయట. అంటే మగవారికి వచ్చినట్టుగా పూర్తిగా మీసాలు, గడ్డాలు వస్తున్నాయట. అలా ప్రత్యేకంగా ఉంటె ఎక్కడకు వెళ్లడం వీలు కాదు, అసలు సాధారణంగా అందరు మహిళలు గడిపే జీవితాన్ని కూడా గడపలేరు. ఇంట్లో కూడా తృప్తిగా జీవించడం కుదరదు. ఎప్పుడు ఎవరో ఒకరు  వస్తూ ఉన్న ఇంట్లో అయితే ఇంకా కష్టమే. అలాంటి పరిస్థితిలో ఉన్న మహిళ ఎలా ఉంటుందో, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో వివరాలలోకి వెళ్లి తెలుసుకుందాం.  

బ్రిటన్ కు చెందిన హర్మాన్ కౌర్ పుట్టుక అప్పుడు సాధారణంగానే ఉన్నప్పటికీ 11ఏళ్ళు  వచ్చేసరికి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్  అనే సమస్యతో అబ్బాయిలకు వచ్చినట్టుగా పూర్తి మీసాలు, గడ్డాలు రావడం మొదలయ్యింది. ఆ వయసుకే అలాంటి సమస్య వస్తే అప్పటి విద్య, ఇతర పరిస్థితులలో చాలా కష్టంగా కాలం గడపాల్సి ఉంటుంది. అందుకే రోజు వాక్సింగ్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది. అది ఎంత కష్టమో చేసుకునే వారికే తెలుస్తుంది.  సాధారణంగా అమ్మాయి చర్మం ఎంత సున్నితంగా ఉంటుందో తెలిసిందే అయితే ఈ అమ్మాయికి ఉన్న లోపంతో చర్మం మారిపోతూ ఉండటం కూడా పెద్ద సమస్యగా పరిణమించింది. దానికి రోజు మానసికంగా కుంగిపోతూ ఉండేది.

అప్పుడే ఒక్క క్షణం ఆగి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంది. అదే లోపాన్ని  చూసి భయపడకుండా, దానిని తన ప్రత్యేకతగా గుర్తించడం అలవాటు చేసుకుంది. అంతే గడ్డాలు, మీసాలు ఉన్న అమ్మయిగా ప్రత్యేక గుర్తింపు పొందటం అలవాటు చేసుకుంది. అప్పటి నుండి తన లోపం నిజంగా లోపంలా కాకుండా అదొక ప్రత్యేకతగా భవిస్తూ మానసికంగా ధైర్యంగా జీవించడం మొదలుపెట్టింది. 2014 లో రాంప్ వాక్ చేసి తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. ఇప్పుడు  తానే చాలా మందికి మోటివేషన్ తరగతులు చెప్తుంది. తాను మాట్లాడేటప్పుడు  తనది మాములు గడ్డం కాదని, ఒక మహిళ గడ్డం అని గర్వంగా చెప్పడం  ఆత్మవిశ్వాసాన్ని  తెలియజేస్తుంది. ఇదే ఎందరిలోనో లోపించి, ఆత్మత్యాగాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: