మంగ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఈ పాపులర్ సింగర్ పేరు తెలియనివారుండరు. ఆమె పాటలతో తెలుగు రాష్ట్రాలలో  యువత నుంచి మొదలు ముసలి వరకు తమదైన శైలిలో ఆకట్టుకుంటోంది. ఆమె పాట పాడింది అంటే ముసలి తాత కూడా చిందేస్తాడు. అలా మంగ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తమదైన శైలిలో పాటలు పాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. దీంతోపాటుగా సినిమాల్లో, ప్రైవేట్ పాటలు తమదైన శైలిలో నటిస్తూ, డ్యాన్సులు చేస్తూ ఆమె అందంతో కుర్రకారును కునుకు లేకుండా చేస్తోంది. అంతటి ఘనత ఉన్నటువంటి మంగ్లీ పాడిన బోనాల పాట పై విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. అవేంటో చూద్దాం.

సింగర్ మంగ్లీ  ప్రతి సంవత్సరం  తెలుగువారి పండుగకు ముందు పండగకు తగినట్టుగా తమ పాటలను పాడతారు. దీంతో ఆ పండగ వైభోగం అంతా ఆ పాటలోనే కనిపిస్తుంది. ఆమె పాడిన టువంటి ఆ పాటలకు కోట్లాది వ్యూస్ వస్తాయి. ప్రస్తుత కాలంలో ఆమె పాడినటువంటి బోనాల పాట చాలా పాపులర్ అయింది. జూలై 11న విడుదలైన ఈ పాట యూట్యూబ్ ఛానల్ ను కుదుపు కుదిపేసింది. హైదరాబాద్ బోనాల పండుగలో ఎక్కడ చూసినా ఈ పాటే దర్శన మిస్తోంది. ఈ సాంగ్ కు రామస్వామి లిరిక్స్ అందించగా, వెంకటాపురం రాకేష్ మ్యూజిక్ చేశారు. ఈ పాటలో మంగ్లీ నటించినది. దీనికి కొరియోగ్రాఫర్గా చేసింది డి పేమ్ పండు. విడుదలైన కొద్దిరోజుల్లోనే లక్షల వ్యూస్ సంపాదించుకున్న ఈ పాట పై ప్రస్తుతం వివాదం నెలకొన్నదని చెప్పవచ్చు. ఈ పాట యొక్క లిరిక్స్ పై కొంతమంది తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 బోనాల పండుగ  తరుణంలో  అమ్మవారిని  కొలుస్తూ పాట పాడాలి కానీ, విమర్శిస్తూ పాటలు పాడడం ఏంటని  కొంతమంది హిందూ సంఘాల వ్యక్తులు మండిపడు తున్నారు అని చెప్పవచ్చు. ఈ పాటలో కొన్ని అసభ్యకర పదాలు కూడా ఉన్నాయని వాటిని మార్చి వేయాలని ఆర్ జె కిరణ్ కూడా విమర్శించారు. ఈ పాట పాడినందుకు పబ్లిక్ గా కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. కొద్దిగా పేరు రాగానే కళ్ళు నెత్తికెక్కయా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే పబ్లిసిటీ కోసం చాలామంది హిందూ  దేవుళ్లను కించపరిచారని, ఇప్పుడు గ్రామంలో ఉన్న దేవతలపై కూడా పడ్డారు అని అన్నారు. ఆర్ జె అన్న మాటలను  కొంత మంది నెటిజన్లు సమర్థిస్తూ, మంగ్లీ తీరును మార్చుకోవాలని  తప్పుబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: