అసలు ఏం జరిగిందంటే, ఇటీవల యుక్తవయసులో చనిపోయిన పది మంది సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు అని రాసి ఉన్న వీడియో థంబ్ నెయిల్ ఫోటోను కోడ్ చేస్తూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో సెటైరిక్‌గా పోస్ట్ చేశాడు. ఆ థంబ్ నెయిల్‌పై హీరోయిన్లు సౌందర్య, ఆర్తి అగర్వాల్‌తో పాటు హీరో సిద్ధార్థ ఫోటో కూడా ఉంది. దీనిపై సిద్ధార్థ్ వ్యంగ్యంగా స్పందించినట్లుగా పోస్ట్‌ను తయారు చేశారు. "అయ్య బాబోయ్, నేను చనిపోయా అని తెలియక ఇంకా సినిమాలు తీస్తున్నా.. నన్ను క్షమించండి అంకుల్ ప్లీజ్" అంటూ సెటైరికల్‌గా రాసి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది.
అయితే హాయిగా నిక్షేపంలా బతికే ఉన్న హీరో సిద్ధార్థ్‌ను యుక్త వయసులో చనిపోయినవారి జాబితాలో చేర్చడాన్ని చూసిన నెటిజన్లు.. ఇదేమి అరాచకం అని కామెంట్లు చేశారు. ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్ హీరో సిద్ధార్థ్ కంట పడింది. దీంతో సిద్ధార్థ్.. ఈ విషయం తనకు ముందే తెలుసునని ట్వీట్ చేశాడు. ఇది తెలిసి తాను ఏం చేశాననే విషయాన్ని కూడా అందులో వివరించాడు. తాను ఈ వీడియోని కొన్నాళ్ల క్రితమే చూసి.. దానిపై యూట్యూబ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. అయితే ఈ వీడియో వల్ల ఎలాంటి సమస్యా లేదని వారు ఇచ్చిన జవాబుకు మనసులోనే తిట్టుకున్నానన్నాడు. అయితే సిద్ధార్థ్.. తన చావు కబురుని చాలా నింపాదిగా చెప్పినట్లుగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి