బిగ్ బాస్ ఎంతో మంది టాలెంట్ నిరూపించుకునే మంచి వేదికగా యోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తర్వాత మంచి యాక్టర్స్ గా ఆదరణ పొందారు. తమ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ విధంగా
బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత అంతా స్టార్ సెలబ్రెటీలు గా మారిపోతున్నారు. అప్పటిదాకా చిన్నచిన్న సెలబ్రిటీలు గా ఉన్నవాళ్లు  బిగ్ బాస్ తో బాగా పేరు సంపాదిస్తున్నారు. పేరుతోపాటు డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నారు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చినందుకు కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి ఈ సెలబ్రిటీలకు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆ స్టార్ డమ్ తో బయట కూడా బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఇందులో చాలామంది లైఫ్ లో సెట్ అవ్వడానికి ఆ ఇమేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. చాలామంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సొంత ఇల్లు లేదా ఖరీదైన కార్లు కొనుక్కుంటున్నారు.


 గతంలో కూడా బిగ్ బాస్ లో పాల్గొన్న హిమజ, సోహెల్,అఖిల్, అరియనా,శివ జ్యోతి, శ్రీముఖి లాంటివాళ్లు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక  కొత్త కార్లను కొన్నారు. తాజాగా ఈ లిస్టులో కి ఈ సీజన్ కంటెస్టెంట్ విశ్వ కూడా చేరారు. విశ్వ బిగ్ బాస్ కి వెళ్లక ముందు అనేక సీరియల్స్ లో ఆర్టిస్ట్ గా నటించాడు. హౌస్ లో ఉండి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు విశ్వ. హౌస్ నుంచి బయటికి రాగానే తాజాగా బీఎండబ్ల్యూ కార్ ని కొనేసాడు. లగ్జరీ కారును కొనడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ కారు తో ఫోటో దిగి ఆ ఫోటో ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి మనం కలలుగన్న కారు ను కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను, నా కుటుంబం లో కి కొత్త మెంబర్ వచ్చింది, దీనంతటికీ కారణం ఆ దేవుడు బిగ్ బాస్  అంటూ విశ్వ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: