అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఈయన రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ తన ఫ్యామిలీకి హీరోనే. షూటింగ్స్ లలో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబ సభ్యులకు తగిన సమయాన్ని కేటాయిస్తూ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారు వెంకీ. అలాగే ఆయన భార్య నీరజ రెడ్డి కూడా తన కుటుంబాన్ని కుటుంబ బాధ్యతలను అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. సాధారణంగా సెలబ్రెటీల భార్యలు, పిల్లలు సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉంటూ పాపులర్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలం లో సెలబ్రెటీల భార్యలు మరియు వారి పిల్లల జోరు మరింత పెరిగింది.

అయితే హీరో వెంకటేష్ భార్య నీరజ రెడ్డి కానీ, వారి పిల్లలు కానీ అస్సలు సోషల్ మీడియాలో టచ్ లో ఉండరు. అంతేకాదు పెద్దగా ఫంక్షన్లకు కానీ, సెలబ్రేషన్స్ కి కానీ హాజరు అవ్వరు. ఎందుకంటే..నీరజ రెడ్డి కి కెమెరా ముందుకు రావడం అందరికీ తమ గురించి తెలియడం పెద్దగా ఇష్టం ఉండదట. ఇక మరో విషయం ఏమిటంటే... వెంకటేష్  - నీరజ రెడ్డిల పెళ్లి వెనుక పెద్ద కథే ఉంది. దగ్గుబాటి వెంకటేష్ కులం వేరే అలాగే నీరజ రెడ్డి కులం వేరే అయినా వీరిది ప్రేమ వివాహం కాదు పెద్దలు కుదిర్చిన పెళ్ళే. అయితే ఇలా ఎలా కుదిరింది అంటే...!!!

అప్పట్లో వెంకటేష్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆయన తండ్రి రామానాయుడు. అలాగే నీరజ రెడ్డికి కూడా వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట. నీరజ రెడ్డి నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకు పలు చోట్ల చాలా థియేటర్లు కూడా ఉన్నాయి.  అయితే అలాంటి సమయం లో నాగి రెడ్డి అనే వ్యక్తి వెంకటేష్ కి మంచి సంబంధం చూడమని  చెప్పగా...ఎపుడు ఆయన మా బంధువుల అమ్మాయి ఉంది.. కానీ మీ కులం కాదు అని చెప్పడంతో మాకు అలాంటి పట్టింపులు లేవు అయితే అమ్మాయి గుణగణాలు బాగుంటే చాలు అని చెప్పడంతో ఆ తర్వాత అన్ని చక చకా కుదిరిపోయాయి. అలా వెంకటేష్ - నీరజ రెడ్డి ల వివాహం జరిగిందట.   నీరజ రెడ్డి ది చిత్తూరు జిల్లాలోని మదనపల్లె.

మరింత సమాచారం తెలుసుకోండి: