సినిమాల్లో హీరోలు మాత్రమే కాదు వారికి దీటుగా ఉండే విలన్ ఉంటేనే ఆ సినిమాలో హీరోకి పవర్ పెరుగుతుంది. అలా సినిమాకి విలన్ కూడా చాలా ముఖ్యం. ఈ ఎవరుపడితే వాళ్ళు విలన్ పాత్రకు సెట్ అవ్వరు. విలన్ అంటే కూడా పలు క్వాలిటీస్ కూడా చాలా ముఖ్యం. ఇప్పట్లో అయితే చాలామంది స్టార్ నటులు విలన్ పాత్రలు చేస్తున్నారు కానీ అప్పట్లో విలన్ అంటే మాత్రం ముగ్గురు నలుగురే గుర్తొస్తారు. వారిలో రావు గోపాల్ రావు తప్పకుండా గుర్తొస్తారు. ఈయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో విలన్ గా నటించారు. అప్పట్లో స్టార్ హీరో చిత్రమంటే విలన్ గా రావు గోపాల్ రావు ఉండాల్సిందే. విలన్ గా ఈయనది మరో ప్రస్థానం అనే చెప్పాలి. అసలు కన్నింగ్నెస్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా ఆయన నటన మహా అద్భుతం.

ఏ సినిమాకి ఆ సినిమాకి విలన్ గా కూడా వైవిధ్యాన్ని కనబరుస్తారు. ఎన్నో వందల చిత్రాల్లో  విలన్ గా రావు గోపాల రావు ఉండాల్సిందే.  విలనిజం ఆయన్ను చూసే పుట్టిందా అన్నట్టుగా ఆయన పాత్రలు ఆశ్చర్యపరిచేవి. మొదట నాటక రంగం లో ఉన్న రావు గోపాల రావు ఆ తరవాత రంగుల ప్రపంచం లో తాను కూడా భాగమవ్వాల్లనే  ఆశతో  సినిమా రంగం వైపు వచ్చారు.  ఆయన కొడుకు రావు రమేశ్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా స్థిర పడిన విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో రావు గోపాల రావు చాలా కష్టాలు ఎదుర్కొన్నారట.
రాగానే ఆయన ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదట. ఆయనలోని ప్రతిభను ఎవరు గుర్తించలేదని, చాలామంది దర్శకులు ఆయన్ని చిన్నచూపు చుసేవారంట.

రావు గోపాల రావు స్వస్థలం కాకినాడ. నాటకాలు రంగం నుండి సినీ రంగం లోకి అడుగువేసి తానేంటో నిరూపించుకున్నారు.  అయితే ఎన్నో వందల చిత్రాలతో ఎంతో సంపాదించిన రావు గోపాలరావు ఆయన చివరి రోజుల్లో చాలా కష్టాలు పడ్డారు అంటే ఎవరైనా నమ్మగలరా... కానీ అది నిజమే. అయితే అన్ని కష్టాలు పడటానికి కారణం కోరి తెచ్చుకున్న ఆర్ధిక కష్టాలేనట అందరినీ నమ్మడం, అడిగిన  ప్రతి ఒక్కరికీ లేదనుకుండా డబ్బు సాయం చేయడం. మన అనుకున్న వారి కష్టాలను తన భుజాలపై వేసుకొని తీర్చడం వంటివి చేస్తూ...చివరికి ఆర్ధిక కష్టాలలో మునిగి పోయాడట రావు గోపాల్ రావు. అలా  చివరకు కనీసం తనకు అనారోగ్యం వస్తే.. ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి డబ్బులు సర్దుబాటు కాక ఇబ్బందులు పడ్డాడట రావు గోపాల రావు. రావు గోపాల రావు.. 1994 లో మరణించారు. ఆయన అంత్యక్రియలకు కూడా పెద్దగా సినీ ప్రముఖులు ఎవరు హాజరు కాకపోవడం  గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: